బహుశా వచ్చే ఎన్నికల్లో అన్నీ పార్టీలకు రాజధాని అంశం మాత్రమే ఏకైక నినాదం అయ్యేట్లుంది. మూడు రాజధానుల ఏర్పాటు నినాదంతో వైసీపీ ఎన్నికలకు వెళ్ళటం ఖాయం. మరి ప్రతిపక్షాలు ఏ నినాదంతో ఎన్నికలను ఫేస్ చేస్తాయి. ఇంకేముంది అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనే నినాదంతోనే ఓట్లడుగుతాయి. టీడీపీ, బీజేపీ+జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ అన్నీ పార్టీలది అమరావతి నినాదమే ఉండేట్లుంది. ఎందుకంటే ఇపుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మూడు రాజధానులను ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి.
 
మూడు రాజధానుల నినాదంతో వైసీపీకి  ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలో ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఉత్తరాంధ్రలోని వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనేది జగన్ ప్లాన్. ఇపుడు అమరావతిలో ఉన్న అసెంబ్లీని శాసనరాజధానిగా కంటిన్యు చేస్తామని చెప్పారు. రేపేదైనా ప్లాన్ మారితే అమరావతిలోనే హైకోర్టును ఉంచాలని అనుకుంటే అప్పుడు అసెంబ్లీ కర్నూలుకు మారే అవకాశముంది. ఏదేమైనా జగన్ ప్రతిపాదన నచ్చని అమరావతి ప్రాంతం లేదా రాజధాని జిల్లాల ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
 
సో మూడు ప్రాంతాలకు మూడు వ్యవస్ధలను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు కాబట్టి ప్రచారం విషయంలో జగన్ కు పెద్దగా సమస్యలు రాకపోవచ్చు. మరి ప్రతిపక్షాల విషయానికి వస్తే అన్నీ అమరావతిలోనే ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తు ఉత్తరాంధ్రలో ఎలా ప్రచారం చేసుకోగలవు.

జనాలు ప్రతిపక్షాలకు ఎందుకు ఓట్లేయాలని అడిగితే ఏమని సమాధానం చెప్పుకుంటాయి. అమరావతి ప్రాంతంలో జగన్ కు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రతిపక్షాలకు ఎదురయ్యేంత ఇబ్బందులైతే కావు. అలాగే రాయలసీమలోని కర్నూలులో  హైకోర్టును వద్దని ప్రతిపక్షాలంటున్నాయి.

ఒకవైపు కర్నూలులో హై కోర్టును వద్దని చెబుతు మళ్ళీ ఓట్లేయమని కర్నూలు జిల్లాలో, రాయలసీమలో ఏమని ఓట్లడుగుతాయి. మొత్తం మీద ప్రతిపక్షాలకు వచ్చే ఎన్నికలు చాలా ఇబ్బందికరమనే చెప్పాలి. అసెంబ్లీ కానీ లేదా హైకోర్టు కానీ అమరావతిలోనే కంటిన్యు చేసేట్లయితే అదే విషయాన్ని వైసీపీ చెప్పుకుంటుంది. మరి ప్రతిపక్షాలు ఏమని చెబుతాయి.
 
అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ అన్నీ అమరావతిలోనే ఉండాలని తాము కోరుకుంటున్నాము కాబట్టి తమకే ఓట్లేయమని అడుగుతాయా ? ఇదే పద్దతిలో అడిగితే గుంటూరు లేదా కృష్ణా జిల్లాల్లో ప్రతిపక్షాలకు వచ్చే మైలేజీ ఎలాగున్నా మిగిలిన ప్రాంతాల్లో గట్టి ఎదురు దెబ్బ తగలటం ఖాయం. ఇవేవీ కాకపోతే జగన్ పాలనలో అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని,  లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని, అప్పులు, వడ్డీలనే అస్త్రాలుగా చేసుకుంటాయా ? జనాలు పట్టించుకుంటారా ? మొత్తానికి చాలా ఇంట్రస్టింగుగానే ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: