ఆ రోజు త‌న వెంట న‌డిచిన‌వారికి
ఆ రోజు త‌న వెంట న‌డిచి పార్టీకి అండ‌గా ఉన్న‌వారికి
త‌న వంతు సాయం ఎన్న‌టికీ ఉంటుంద‌న్న మాట
ఒక‌టి జ‌గ‌న్ వినిపించి స‌క్సెస్ అయ్యారు..
ఇచ్చిన మాట‌కు అనుగుణంగా ప‌ద‌వులు కేటాయిస్తూ
శ్రీ‌కాకుళం జిల్లా వీర విధేయులకు అండ తాన‌ని నిరూపించారు..
మ‌రోసారి!

శ్రీ‌కాకుళం వైసీపీ కి సంబంధించిన అప్డేట్ ఇది. ఒక‌రు కాదు ఇద్ద‌రికి వైసీపీ కోట‌రీలో ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్క‌డం విశేషం. ఇంకా చెప్పాలంటే శ్రీ‌కాకుళం జిల్లాకు మూడు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ద‌క్కాయి. ఇప్ప‌టికే దువ్వాడ శ్రీ‌ను ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయ‌న టెక్కలి నియోజ‌క‌వ‌ర్గ నేత. అదేవిధంగా పార్టీకి విధేయులుగా ఉంటూ విశేష కృషి చేస్తున్న మ‌రో ఇద్ద‌రు నేత‌లు అయిన పాల‌వ‌ల‌స విక్రాంత్ కు, వ‌రుదు క‌ల్యాణికి కూడా తాజా నియామ‌కాల్లో చోటు ఇవ్వ‌డంతో జిల్లా వ‌ర్గాల్లో ఆనందం రెట్టింపైంది.


ఆంధ్రావ‌నిలో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. ఇదే స‌మ‌యంలో కొన్ని మార్పులూ రానున్నాయి. పార్టీల‌క‌తీతంగా సాగే కుల స‌మీక‌ర‌ణ‌లు కొంద‌రికి క‌ల‌సి రానున్నాయి. కొంద‌రికి అవే అడ్డంకి కానున్నాయి. ఈ తరుణంలో వైసీపీ బాస్ జ‌గ‌న్ కొన్ని కీ ల‌క నిర్ణ‌యాలు వెలువ‌రిస్తున్నారు. త‌న‌ను న‌మ్ముకుని ముందు నుంచి పార్టీకి సేవ‌లందించిన వారికి ప‌ద‌వులు ఇచ్చి గౌర‌విస్తు న్నారు. అదేవిధంగా పార్టీని న‌మ్ముకుని అధిష్టానం ఆదేశాల‌కు అనుగుణంగా పార్టీ నియ‌మింంచిన అభ్యర్థుల గెలుపున‌కు స‌హ‌క రించిన వారికి, ఎటువంటి ప్ర‌లోభాల‌కు లొంగ‌క పార్టీ కోసం ప‌నిచేసిన వారికి జ‌గ‌న్ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే శ్రీ‌కాకుళం నాయ‌కుల‌కు జ‌గ‌న్ త‌న‌వంతు ప్రోత్సాహం అందిస్తున్నారు.


ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్సీ ప‌ద‌విని తాజాగా నియ‌మించారు. బీసీ నాయ‌కుడిగా పేరున్న పాల‌వ‌ల‌స రాజశేఖరం (పాల‌కొండ నేత) కుమారుడు పాల‌వ‌ల‌స విక్రాంత్ ను ఎమ్మెల్సీగా తీసుకున్నారు. వాస్త‌వానికి పార్టీ ప్రారంభం నుంచి మంచి సేవ‌లు అందించిన ఈయ‌న పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి స్వయానా సోద‌రుడు. ఆయ‌న తండ్రి మాదిరిగానే మంచి ఫాంలో ఉన్న నాయ‌కుడు. కాపు సామాజిక‌వ‌ర్గాన్ని ముందుండి న‌డుపుతున్న నేత. రాజ‌కీయంగా రాజాం, పాల‌కొండ అనే రెండు నియోజ‌క‌వర్గాల్లోనూ మంచి ప‌ట్టున్న నేత. అందుకే ఆయ‌న‌కు మంచి స్థానం ఇచ్చి పార్టీకి చేసిన సేవ‌ల‌కు గుర్తింపు ద‌క్కేలా చేశారు. ఇదే కోవ‌లో శ్రీ‌కాకుళం అమ్మాయి వ‌రుదు క‌ల్యాణి ని కూడా ప్రోత్స‌హించి పార్టీకి మొద‌టి నుంచి సేవ‌లందించినందుకు ఎమ్మెల్సీని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: