ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన తో పొత్తు పెట్టుకుంటుంద‌న్న‌ ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బలమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని అధికారం నుంచి దించాలంటే అది కచ్చితంగా జనసేన తో పొత్తు వల్ల సాధ్యమవుతుందని రెండు పార్టీలకు చెందిన కీలక నేతల మ‌ధ్య అంత‌ర్గ‌తం గా చర్చలు నడుస్తున్నాయి. అయితే టీడీపీలో చాలామంది మాత్రం జనసేన కు 10 ఎమ్మెల్యే ...రెండు ఎంపీ సీట్ల కు మించి ఇస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాశనం అయిపోతుంద‌ని.. తెలుగుదేశం కేడ‌ర్ చెల్లాచెదురు అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు జనసేన నుంచి తమకు 40 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు ఎనిమిది నుంచి పది ఎంపీ సీట్లు కావాలని ప్రపోజల్స్ వస్తున్నాయట. అయితే తెలుగుదేశం పార్టీలో మరో ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. జనసేన తో పొత్తు పెట్టుకుంటే జనసేన తమకు వెన్నుపోటు పొడుస్తుంన్న సందేహాల‌ను కొందరు  వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల ను వీరు ప్ర‌స్తావిస్తున్నారు.

ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉన్నాయి. టిడిపి జనసేన - జనసేన పొత్తు కుదిరిన నేప‌థ్యంలో జ‌న‌సేన‌ ఐదు స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్ల విజయం సాధించింది. టిడిపి 15 చోట్ల పోటీ చేసి కేవలం నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది. ఇక్కడ జనసేన ఓట్లు టిడిపికి ప‌డ లేదని స్పష్టంగా తెలిసింది. రేప‌టి రోజున‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తో పొత్తు పెట్టుకున్నా మరోసారి ఇలాంటి ఎదురుదెబ్బ తగులుతుంది అన్న సందేహాలు టిడిపి వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

మ‌నం జ‌న‌సేన‌కు మ‌న‌సాక్షి గా స‌పోర్ట్ చేసినా ఆ పార్టీ కేడ‌ర్ మాత్రం పాత విష‌యాలు మ‌న‌సులో పెట్టుకుని మ‌నకు స‌పోర్ట్ చేయ‌క‌పోతే మ‌నం న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని.. పైగా జ‌నసేన‌తో పొత్తు వ‌ల్ల చాలా మంది నేత‌లు త్యాగాలు చేయాల‌ని ఇది కూడా పార్టీకి మైన‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: