నాలుగు రోజులు ఆగి చూడండి ప్లీజ్ కేజీ ట‌మాట ధ‌ర ముప్పై నుంచి న‌ల‌భై రూపాయ‌ల‌కు ప‌ల‌క‌డం గ్యారంటీ అని అంటోంది జ‌గ‌న్ స‌ర్కారు. ఇప్ప‌టికే పంటను దిగుమ‌తి చేసుకుని విక్ర‌యించేందుకు చేసిన ఏర్పాట్లు స‌ఫ‌లీకృతం కావ‌డంతో గుంటూరు, కృష్ణా జిల్లాలలో వంద రూపాయ‌ల‌కు పైగానే ఉన్న ధ‌ర కాస్త దిగి వ‌చ్చి అర‌వై కి ప‌లికింది. ఇదే మాదిరిగా ఇంకొన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుని పంట‌ను అంద‌రికీ అందుబాటులోకి తీసుకు వ‌స్తే వినియోగ‌దారుల‌కు ఊర‌ట ద‌క్కడం ఖాయం.


రాష్ట్ర వ్యాప్తంగా ట‌మాట సాగు 60 వేల హెక్టార్ల‌కు పైనే

చిత్తూరు అనంత‌పురం క‌ర్నూలులో సాగు యాభై వేల హెక్టార్ల పైనే

మొత్తం దిగుబ‌డి 22.16 ల‌క్ష‌ల ట‌న్నులు

ఆ మూడు జిల్లాల నుంచి వ‌చ్చే దిగుబ‌డి 20.36 ల‌క్ష‌ల ట‌న్నులు


అయిన‌ప్ప‌టికీ అకాల వ‌ర్షాల కార‌ణంగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పంట లేదు. దీంతో అనూహ్య రీతిలో పంట ధ‌ర ఒక్క‌సారిగా పెరిగిపోయింది. వ‌ర్షాల‌కు రాయ‌ల సీమ జిల్లాలు తీవ్ర ప్ర‌భావానికి నోచుకున్నాయి. దీంతో సీమ జిల్లాల‌లో పంట ఎందుకూ ప‌నికి రాకుండా పోయింది. అధికారిక స‌మాచారం అనుస‌రించి రెండు వేల హెక్టార్ల‌లో పంట పోయింది.

ఆ మూడు జిల్లాలే కీల‌కం అని ట‌మాట సాగు అక్క‌డే అధికం అని అంటున్నాయి మార్కెట్ వ‌ర్గాలు. ట‌మాట సాగుకు కేరాఫ్ గా నిలిచే చిత్తూరు, అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాలో పంట సాగు త‌గ్గిపోవ‌డం, బ‌హిరంగ మార్కెట్లో డిమాండ్ విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో ట‌మాట ధ‌ర ఒక్క‌సారిగా చుక్క‌లు చూపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం రంగంలోకి దిగి వీలున్నంత మేర కొనుగోలు చేసి రైతు బ‌జార్ల‌లో అమ్మ‌కాలు సాగించేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీంతో మ‌రో వారం రోజులు ఆగండి ధ‌ర‌లు దిగి వ‌స్తాయి అని చెబుతున్నారు అధికారులు.


ప్రస్తుతం మార్కెట్లోనూ మీడియాలో ట‌మాట అనే వ‌ర్డ్ ట్రెండ్ సెట్ట‌ర్ గా ఉంది. ముఖ్యంగా పంట దిగుబ‌డి త‌గ్గి  రేటు పెర‌గ‌డం ఓ కా ర‌ణం కాగా..ఈ సారి కార్తీకం నెపంతో ఎప్ప‌టిలానే వ్యాపారుల‌కు నాలుగు కాసులు తీసుకువ‌చ్చేందుకు వీలుగా మార్కెట్లో కృత్రిమ కొర‌త సృష్టించ‌డం మ‌రో కారణం. దీంతో మార్కెట్లో అప్పుడున్నంత డిమాండ్ ఇప్పుడు లేక‌పోయినా కూడా అదే ప‌నిగా మీడియా లో వ‌స్తున్న వార్తల ప్ర‌భావంతో ఆ నోట ఈ నోట ఇదే మాట ట్రెండ్ అవుతోంది. వాస్త‌వానికి ప్ర‌భుత్వాలు రంగంలోకి దిగితే ట‌మాట ధ‌ర‌లు దిగిరావ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ ఎందుక‌నో ఇప్ప‌టిదాకా జ‌గ‌న్ ప్ర‌భుత్వం  పెద్ద‌గా ధ‌ర‌ల నియంత్ర‌ణ‌పై దృష్టి సారించ‌లేదు. తాజాగా మార్కెటింగ్ శాఖ ను రంగంలోకి దింపి, కేజీ ట‌మాట‌లు 60 రూపాయ‌లకే విక్ర‌యించేలా చ‌ర్య‌లు తీసుకోనుంది. దీంతో ట‌మాట ధ‌ర‌లు సామాన్యుడికి కాస్త అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి దిగుమ‌తులు కూడా బాగుండ‌డంతో కొద్ది రోజుల్లోనే ధ‌ర‌లు దిగివ‌స్తాయ‌ని ప్ర‌భుత్వ మీడియా చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: