ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారాం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ నుంచి 1999 లో మాత్రమే చివరిసారిగా గెలిచారు.

2004 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయ‌న‌ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి మరోసారి పార్టీ మరి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నిక‌కలలో కూడా తమ్మినేని ఓడిపోయారు. అలాంటి తమ్మినేని గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం లో ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు దశాబ్దాల తర్వాత తమ్మినేని సీతారాం కు దక్కిన గెలుపు ఇది.

సీనియర్ కోటాలో తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన ముందు నుంచి ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ అనూహ్యంగా ఆ జిల్లాకు చెందిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు మంత్రి పదవి ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఆ సామాజిక వర్గం కోటాలో పలాస ఎమ్మెల్యే అప్పలరాజును కూడా మంత్రిని చేశారు.

ఇప్పటికే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. దీంతో తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు మంత్రివర్గాన్ని మారిస్తే కాళింగ సామాజిక వర్గం తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే జగన్ త‌మ్మినేనికి షాక్ ఇచ్చినట్టు అవుతుంది.

త్వరలో క్యాబినెట్ ప్రక్షాళన జరుగుతుంది అన్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే సీఎం జగన్ ను త‌మ్మినేని రెండు మూడు సార్లు కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం ఆయనకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వ‌లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: