రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తీపి క‌బురు. త్వ‌ర‌లోనే కొత్త పీఆర్సీ ప్ర‌క‌టించే అవ‌కాశం..అవును! మీరు విన్న‌ది నిజ‌మే! డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే 11వ వేత‌న స‌వ‌ర‌ణ‌కు సీఎం ఆమోదం తెల‌ప‌నున్నారు. దీంతో ఉద్యోగుల‌లో ఆనందోత్సాహాలు మిన్నుముడుతున్నాయి. ఎ ప్ప‌టి నుంచో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల‌కు ఈ పరిణామం కాస్త ఊర‌ట‌నిచ్చేదే! ఎందుకంటే కొత్త ప్ర‌భు త్వం వ‌చ్చేక త‌మ‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఏవీ ద‌క్క‌లేద‌ని తీవ్ర అక్క‌సుతో ఉన్న ఆయా వ‌ర్గాల‌కు జ‌గ‌న్ చెప్పిన మాట ఓ విధంగా ఉప‌ శ‌మ‌నమే! ఇక పీఆర్సీకి సంబంధించి క‌మిటీ నివేదిక వ‌చ్చేలోగానే ఉద్యోగికి సంబంధించిన వేత‌న స‌వ‌ర‌ణను అమ‌లు చేస్తామ‌ని కూడా సీఎం అంటుండ‌డంతో ఇప్ప‌టిదాకా ఈ విష‌య‌మై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న తొల‌గిపోయింది.

వాస్త‌వానికి గ‌త కొద్ది రోజులుగా కొత్త పీఆర్సీ వ‌ర్తింపు కోసం,అదేవిధంగా డీఏ బ‌కాయిల చెల్లింపు కోసం జిల్లా స్థాయిల‌లో ఉద్యోగ సంఘా లు  నిర‌స‌న‌లు తెలియ‌జేస్తున్నాయి. కొన్ని జ‌గ‌న్ కు అనుబంధంగా ఉన్న సంఘాలు అయిన‌ప్ప‌టికీ క్షేత్ర స్థాయిలో ఉన్న ఒత్తిళ్ల కార‌ణం గా వాటికి త‌లొగ్గి సంబంధిత సంఘ నేత‌లు కాస్త దురుసుగానే ప్ర‌వ‌ర్తించాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ఎన్జీఓ సంఘం కూడా చాలా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. తోటి ఉద్యోగుల నుంచే విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను బూచిగా చూపి ప్ర‌భుత్వంపై నింద‌లు వేయ‌డం త‌గ‌ద‌ని, తాను వేత‌న జీవుల‌ను సొంత కుటుంబ స‌భ్యులుగానే చూస్తాన‌ని ప‌దే ప‌దే జ‌గ‌న్ చెప్పి చూశారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ కాస్త మెత‌క వైఖ‌రితో చెప్పినా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు హోదాలో స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి మాత్రం ఎప్ప‌టిక‌ప్పు డు ఉద్యోగుల‌ను నియంత్రించే ప్ర‌య‌త్న‌మే చేశారు. అదేవిధంగా స‌చివాల‌యంలో స‌మాచారం బ‌య‌ట‌కు వెళ్లేందుకు వీల్లేద‌ని హుకుం జారీ చేశారు కూడా! ఈ నేప‌థ్యంలో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిగినా కూడా ఏదీ ఓ కొలిక్కి రాలేదు. త‌న స్నేహితుడు, విధేయుడు అయిన ఏపీ ఎన్జీఓ సంఘ నేత బండి శ్రీ‌ను కూడా త‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించిన ఉదంతాలు కానీ సంద‌ర్భాలు కానీ ఉండ‌డంతో జ‌గ‌న్ కా స్త నొచ్చుకున్నారు. ఇదే స‌మ‌యంలో స‌చివాల‌య ఉద్యోగులు కూడా త‌మపై కొన్ని ఆరోప‌ణ‌లు చేసి సీఎం త‌మ‌ను దూరం చేసుకోవ‌ డం త‌గ‌ద‌ని చెబుతూనే, క‌రోనా దృష్ట్యానే తాము ఇంత‌కాలం కొత్త పీఆర్సీ వ‌ర్తింపుపై ఒత్తిడి తీసుకు రాలేద‌ని, ఇందులో రాజ‌కీయ ప్ర‌యో జ‌నాలు ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా తాను అనుకున్న విధంగానే నిర్ణ‌యించిన తీరులోనే వ‌ చ్చే నెల మొద‌టివారంలోనే కొత్త వేత‌న స‌వ‌ర‌ణ‌కు స్ప‌ష్ట‌మ‌యిన సంకేతాలు ఇస్తాన‌ని చెప్పి ఉద్యోగుల‌ను శాంతింప‌జేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp