రైతుల పాదయాత్ర... న్యాయస్థానం నుంచి దేవస్థానం... అమరావతినే రాజధాని గా ఉంచాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు తిరుమల చేస్తున్న పాదయాత్ర. ఈ  యాత్రక ప్రస్తుతం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో పర్యటిస్తోంది.  తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చామని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అమరావతి అభిృద్ధి పైదృష్టి పెట్టలేదనేది వారి ఆవేదన. ఇందుకోసం వారు తమ పోరాటంలో భాగంగా తిరుమల వరకూ పాదయాత్ర చేస్తున్నారు.
అయితే ఇక్కడి రైతులు ప్రస్తుతం అపార నష్టాన్ని మూటగట్టుకుని దుఃఖ సాగరంలో ఉన్నారు. ఇటీవలి తూఫాన్లు, భారీ వర్షాలకు  రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లురు జిల్లా రైతాంగం కూడా కోలుకోలేని రీతిలో నష్టపోయారు. అమరావతి రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ ముందుకు సాగుతున్నారే తప్ప , పక్క రైతులు నష్టపోతే కనీసం వారిని పలుకరించడే లేదని నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 నెల్లురు జిల్లా పాడి పంటలకు ప్రసిద్ధి  చెందిన ప్రాంతం. ఇక్కడి వరి సారు ప్రపంచ స్థాయిలో పేరుగాంచింది.ఇక్కడి పురుడు పోసుకున్న వరి పేరు మొలగొలుకులు, ఈ రకం ధాన్యంకు ఎంతో పేరుంది. వరన్నం అంటే నెల్లురు మొలగొలుకుల అన్నం అని పేరుండేది. నెల్లూరు డెల్టా ప్రాంతం కూడా కావడంతో దీర్ఘకాలిక పంట అయిన మొలగొలుకులను ఇక్కడి రైతాంగం సాగుచేసేవారు.  నెల్లూరు డెల్లాలో  కొడవలూరు, విడవలూరుతో పాటు పరిసర ప్రాంతాలలో మూడు కార్లు ( |ఏడాదికి మూడు పంటలు) వరి సాగవుతుంది.  ఇటీవలి వర్షాలకు కొడవలూరు, విడవలూరు ప్రాంతాలలో  దాదాపు లక్ష ఎకారలకు పైగా పంట నష్టం జరిగింది.  దీని గురుంచి ,రైతాంగానికి జరిగిన నష్టం గురించి  దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంచెం ముందూ వెనుక స్థానిక రైతులను పలుకరించారు. వారిని ఓదార్చారు.  బతుకు పై భరోసానిచ్చారు. కానీ ఇదే  ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు  స్థానిక రైతుల వైపు కన్నెత్తి కూడా చూడలేదనే విమర్శలున్నాయి.
అమరావతి రైతులు నెల్లూరు జిల్లాలో ప్రవేశించే సమయానికి కొద్దిగా చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి.   రెండు మూడు రోజలకల్లా అవి తీవ్ర రూపం దాల్చాయి. వాగులు, వంకలూ పొంది పొర్లాయి.  దీంతో జన జీవనం అస్తావ్యస్తమైంది.  కొన్ని ప్రాంతాలలో నారు దశలో పంటలు నీట మునిగితే, చాలా  ప్రాంతాలలో చేతికందిన పంట నీట మునిగింది. రైతులకు కన్నీరు మిగిల్చింది. వర్షాలు భారీ గా పడటంతో అమరావతి రైతులు  బోగోలు మండలం వద్ద పాదయాత్రకు విరామం ఇచ్చారు.  ఆ తరువాత కొనసాగించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ నెల్లురు జిల్లా పర్యటన నేపథ్యంలో మరో దఫా  పాద యాత్రకు విరామం ఇచ్చి .. ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు. ఎక్కడ కూడా  స్థానిక రైతులను  అమరావతి ఐకాస పట్టించు కున్న దాఖలాలు లేవు. ఎం సేపు ప్రభుత్వాన్ని విమర్శించడం వరకూ తమ సవయాన్ని వెచ్చిస్తున్నారు. స్థానిక రైతుల గోడు మాత్రం  అమరావతి రైతులకు వినిపించడం లేదనే విమర్శలున్నాయి.
దీనికి తోడు వివిధ పార్టీల నేలతు అమరావతి రైతుల పాదయాత్రవద్దకు వచ్చి  తమ మద్దతు తెలిపారు.  భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు, మాజీ కేంద్ర మంత్రులు పురంధ రేశ్వరి, సుజనా చౌదరి,  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుసోము వీర్రాజు,  పార్లమెంట్ సభ్యులు  సిఎం రమేష్,  తదితరులు  నెల్లూరు జిల్లా వద్ద అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు.  వారికి ధన సాయం కూడా చేశారు. అదే సమయంలో నెల్లూరు జిల్లాను వరద ముంచెత్తు తోంది. ఆయినా వారికి నీట మునిగిన పొలాలు,  ఫలితంగా రైతుల కంటి నుంచి జాలువారిన కన్నీరు బిజేపి నేతలకు కనిపించ లేదు.
  నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్ ఏ  బి రామారావు కూడా అమరావరి రైతులకు సంఘీభావం తెలిపారు. పెద్ద మొత్తంలో నిధులు అంజేశారు. స్థానికంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు కళ్లముందు కనిపిస్తున్నా వీరి కంటికి కానరాలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: