తెలంగాణ కాంగ్రెస్ కు ఆ కుటుంబం ఆయువుపట్టు లాంటిది. కానీ కొద్ది రోజులుగా ఫ్యామిలీ కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో వివాదంతో సహాయనిరాకరణ కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ లైట్ తీసుకున్న  స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ జిల్లాపై ఆ ఫ్యామిలీ పట్టేంటో గుర్తించ్చినట్టుంది. ఆ జిల్లాలో ఆ ఫ్యామిలీ పోటీకి దిగాలని నామినేషన్ చివరి రోజు వరకు హస్తం పార్టీ కీలక నేతలు ఆ కుటుంబం తో చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయిందట. కోమటిరెడ్డి బ్రదర్స్ రాష్ట్రవ్యాప్తంగా మాస్ లీడర్లు గా పేరున్న నాయకులు. వాళ్ల సొంత జిల్లా అయిన నల్గొండలో ఎవరికీ లేనంత పట్టు ఈ అన్నదమ్ములకు ఉంది. అయితే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయ్యాక కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు వాళ్లు వచ్చినా రాకున్నా  పెద్దగా పట్టించుకోలేదు కానీ సీన్ కట్ చేస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి నల్గొండ జిల్లా పోటీపై కోమటిరెడ్డి బ్రదర్స్ ని సంప్రదించాల్సి వచ్చిందట. వాళ్ళిద్దరూ అంగీకరిస్తేనే అక్కడ  పార్టీ అభ్యర్థిని ఎన్నికల రంగంలోకి దించ లేని  పరిస్థితి వచ్చిందని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతలు జానారెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ అంగీకారం తప్పనిసరన్న ప్రచారం సాగుతోంది. కానీ అక్కడే పరిస్థితి ఇంకోలా మారిందట.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ చివరి రోజు  వరకు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో పోటీకి తాము సహకరించలేమాని పదే పదే చెప్పడంతో అధిష్టానం చేతులెత్తయాల్సి వచ్చిందని పార్టీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బంధువులు పోటీలో నిలపడానికి ఒప్పుకున్న బ్రదర్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వెనకడుగు వేయాల్సి వచ్చిందట. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒప్పుకొని ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉండేదని ప్రత్యర్థులు ఎవరికైనా ముచ్చెమటలు పట్టావెన్న టాక్ వినిపిస్తోంది. గతంలో నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి రెడ్డిని రంగంలోకి దించి అధికార పార్టీని హైరానా పెట్టిన సంగతిని పార్టీలో కొందరు సీనియర్లు గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉన్న ప్రయారిటీ ని గుర్తించి వారి సమస్యను పరిష్కరించకుంటే రాజకీయంగా హస్తం పార్టీకి భారీ నష్టమే జరుగుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ సమన్వయ లోపాన్ని ఎలా సరిదిద్దుతుందో సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: