ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి కురిసిన వ‌ర్షాల వివ‌రాల‌ను ఇవాళ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చ‌ర్చించారు. ఈసంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ముఖ్యంగా నాలుగు జిల్లాల‌లో తీవ్ర న‌ష్టం జ‌రిగిందని.. ఎక్కువ‌గా మూడు జిల్లాల‌లో  భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు.  క‌డ‌ప జిల్లాలోని పింఛా, అన్న‌మ‌య్య రిజ‌ర్వాయ‌ర్‌ల వ‌ద్ద సంభ‌వించింది. ఆకాశానికి చిల్లు ప‌డింద‌నే విధంగా వ‌ర్షం కురిసింద‌ని సీఎం అసెంబ్లీలో ప్ర‌స్తావించారు. దాదాపు 100 ఏండ్ల‌లో ఎన్న‌డూ క‌నివిని ఎరుగ‌ని రీతిలో ఏపీలో వ‌ర్షాలు కురిసాయి. చెయ్యేరు దిగువ‌న ఉన్న గ్రామాలు అన్ని జ‌ల‌దిగ్భందంలో చిక్కుకుపోయాయ‌ని వెల్ల‌డించారు సీఎం. అన్న‌మ‌య్య గురువారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత పింఛా, బ‌హుళ‌, మాంద‌వ్య ఇత‌ర వాగులు, వంక‌లు క‌లుపుకొని 3.2ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు కేవ‌లం 2 నుంచి 3 గంట‌ల వ్య‌వ‌ధిలోనే చెయ్యేరు నుంచి బ‌య‌టికి వ‌చ్చింద‌ని ఈనాడు ప‌త్రిక‌లోనే వెల్ల‌డించార‌ని ప్ర‌స్తావించారు.

న‌వంబ‌ర్ 18, 19 తేదీల‌లో మొత్తం 51 మండ‌లాల్లో 10.7 సెం.మీ వ‌ర్ష‌పాతం కురిసింది. దీంతో పరిస్తితి ఏవిదంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చ‌ని.. తిరుప‌తి స‌హా చిత్తూరు జిల్లాలో శేషాచ‌ల ప‌ర్వ‌త శ్రేణికి వెనుక వైపు కురిసిన భారీ వ‌ర్షాలు.. చెయ్యేరు ప‌రివాహ‌క ప్రాంతానికి చేరుకుంది. నాలుగు జిల్లాల‌లో ఏక‌కాలంలో వ‌ర్షం కుర‌వ‌డంతో ఏపీ రాష్ట్రంలో భారీగా నీరు చేర‌డంతో ఏడాదిలో కురిసిన వ‌ర్షం ఒక ఎత్త‌యితే.. కేవ‌లం 2 మూడు రోజుల్లో కురిసిన‌ కుంభ‌వృష్టితో వ‌ర్షం బీభ‌త్సం సృష్టించింద‌ని ప్రాజెక్ట్ డిజైన్ చేసిన వ్య‌క్తులే ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేసార‌ని సీఎం తెలిపారు.

పింఛా ప్రాజెక్ట్ తెగిపోయి ఒక్క‌సారిగా అన్న‌మ‌య్య వ‌ద్ద‌కు వ‌ర‌ద ముంచుకురావ‌డంతో  వ‌ర‌ద ఉధృతికి చెరువుల క‌ట్ట‌ల‌న్నీ తెగిపోయాయి. సంవ‌త్స‌ర కాలంలో ఒక్క‌సారి కూడ నిండ‌ని ప్రాజెక్ట్ లు మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే కురిసిన వ‌ర్షానికి నిండుకుండ‌లా నిండిపోయాయ‌ని పేర్కొన్నారు. ఓ బ‌స్సు న‌దిలో కొట్టుకుపోవ‌డం ద్వారా  ప్రాణ‌న‌ష్టం కూడా జ‌రిగింద‌ని గుర్తు చేసారు సీఎం. పింఛా ప్రాజెక్ట్ ఔట్ ప్లో కంటే ఇన్‌ఫ్లో 3 రెట్లు ఎక్కువ‌గా ఉండింద‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వం వేలాది మంది ప్ర‌జ‌ల‌ను కాపాడామ‌ని.. అయినా ప్ర‌తిప‌క్షాల నాయ‌కులు రాజ‌కీయాల కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని పేర్కొన్నారు.

నంద‌లూరు వ‌ద్ద బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికులను కాపాడిన‌ట్టు గుర్తు చేసారు. కార్తీక పూజ‌లు చేస్తున్న వ్య‌క్తులు 20 మంది వ‌ర‌కు మ‌ర‌ణించార‌ని వెల్ల‌డించారు సీఎం. దాదాపు 1250 కుటుంబాల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాం అని గుర్తు చేశారు జ‌గ‌న్‌. హెలికాప్ట‌ర్‌తో స‌హా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆదేశాలు ఇచ్చాం అని.. రాష్ట్రం అంతా జ‌రిగిన న‌ష్టాన్ని నిరంత‌రాయంగా అంచెనా వేస్తూ స‌హాయక చ‌ర్య‌లను  చేప‌ట్టాం. నేను ఏరియ‌ల్ స‌ర్వేకు వెళ్లేతే.. త‌న‌ను వ్య‌తిరేకించిన‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కాల‌గ‌ర్భంలో క‌లిసిన‌ట్టే జ‌గ‌న్ క‌లుస్తార‌ని  చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఏపీ ప్ర‌తిపక్ష నేత చంద్ర‌బాబు సంస్కారానికి నా న‌మ‌స్కార‌ములు అని అసెంబ్లీలో జ‌గ‌న్ వెల్ల‌డించారు. క‌డ‌ప నా సొంత జిల్లా.. సొంత జిల్లా మీద ప్రేమ ఎక్కువ అని.. వ‌ర‌ద‌లు వ‌చ్చిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను అసెంబ్లీకి రావొద్ద‌ని సూచించానని వివ‌రించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: