జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కి ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 ఎమ్మెల్సీ పోస్టులను భర్తీ చేశారు. ఈ ఎమ్మెల్సీ పదవు ల‌ లో ఖ‌చ్చితంగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కి పదవి వస్తుందని ఆయన అనుచరులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రామ‌ సుబ్బారెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు సుధీర్ రెడ్డి కి ఇచ్చి జగన్ తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నారు.

గత రెండు సంవత్సరాలుగా సుధీర్ రెడ్డి, రామ‌సు బ్బారెడ్డి మధ్య జరుగుతున్న వారిలో భాగంగా జగన్ ఇప్పటికే ఇద్దరు నేతలను అమరావతి పిలిపించి ప‌లు సార్లు చ‌ర్చించారు. ఈ క్ర‌మంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న సుధీర్ రెడ్డి కి జమ్మలమడుగు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక రామ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పారు.  అయితే ఈసారి కడప జిల్లా నుంచి బద్వేలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గోవింద రెడ్డికి ఎమ్మెల్సీ పదవి లభించింది.

ఆయన ఇప్పటివరకు ఎమ్మెల్సీ గా ఉన్నారు.. మ‌రోసారి ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి రెన్యువ‌ల్ అయ్యింది. ఇక అదే కడప జిల్లా నుంచి రమేష్ యాదవ్ - రామచంద్రయ్య కూడా ఎమ్మెల్సీ లుగా ఉన్నారు. రేపటి రోజున కొన్ని ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినా అవి కడప జిల్లాకు దక్కుతాయి లేదా అన్నది కూడా సందేహమే. ఇప్పటికే కడప జిల్లాకు ఎక్కువ పదవులు ఇచ్చార‌న్న‌ కామెంట్లు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై కొంద‌రు నేత‌లు అసంతృప్తితో కూడా ఉన్నారు.

దీంతో రామసుబ్బారెడ్డి కి క‌నీసం భవిష్యత్తులో అయినా ఎమ్మెల్సీ వస్తుందన్న గ్యారెంటీ అయితే లేదని వైసిపి వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై రామసుబ్బారెడ్డి టెన్షన్ పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: