ముంబయి బాంబ్ బ్లాస్ట్.. 2008 నవంబర్ 26వ తేదీన ఈ జరిగిన ఈ మారణ హోమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి ప్రధాన దోషిగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ నిలుస్తుంది. దేశంలోకి ఉగ్రవాదులు రాకుండా అరికట్టడంలో యూపీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి కూడా. ఇక అదే సమయంలో ఉగ్రదాడుల తర్వాత బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన నాటి కేంద్ర హోమ్ మంత్రి శివారాజ్ పాటిల్.. వ్యవహరించిన తీరు ఎన్నో విమర్శలకు తావిచ్చింది. నాలుగు గంటల్లో ఏకంగా నాలుగు డ్రస్సులు మార్చారు. దీనిపై కూడా అప్పట్లో పెద్ద ఎత్తు దుమారమే రేగింది. చివరికి దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ... నాలుగు రోజుల తర్వాత నవంబర్ 30వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు శివరాజ్ పాటిల్. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.

గత 20 ఏళ్లలో జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లపై తాజాగా మనీశ్ తివారీ పుస్తకం రాశారు. 10 ప్లాష్ పాయింట్స్.. 20 ఇయర్స్ పేరుతో వచ్చిన ఈ పుస్తకంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు తివారి. ఓ వైపు వందల మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకుంటుంటే... యూపీఏ ప్రభుత్వం మాత్రం సహనంతో వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు మనీశ్ తివారి. కొన్ని బలహీనతల కారణంగానే ప్రభుత్వం అప్పట్లో ఉదాసీనంగా వ్యవహరించినట్లు తివారి వెల్లడించారు. దాడులు జరుగుతున్న సమయంలో భారత ప్రతిస్పందన బలహీనంగా ఉందన్నారు. అందువల్లే వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో సైనికులు, పోలీసులు వీర మరణం పొందారని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌పై ధీటుగా స్పందించేందుకు సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చే విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదన్నారు. ఇప్పుడు మనీశ్ తివారి రాసిన పుస్తకం రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: