భారతదేశం అంతర్జాతీయంగా చాలా వడివడిగా పలుకుబడి పెంచుకుంటుంది. ఇదంతా ఒక్కరోజులో జరిగిపోలేదు అని అందరికి తెలిసిందే. గతంలో కొన్ని దేశాల గూడుపుఠాణి వ్యూహాల వలన ఎప్పుడో భారత్ ముందు వరసలో ఉండాల్సింది ఇప్పుడు ఆ అవకాశం చేజిక్కించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అడ్డంకులు లేవని చెప్పలేము. కేవలం పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే స్వభావం కూడా అన్ని సార్లు ఇందుకు పని చేయదు. స్వతహాగా అంతర్జాతీయ సమాజం కరోనా సమయంలో భారతదేశం ప్రపంచం పట్ల ఎలా స్పందించింది అనేది గమనించింది. దీనితో చాలా దేశాల అభిప్రాయాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్ పట్ల అనుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం ఆరంభించింది అంతర్జాతీయ సమాజం.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు పెట్టుబడులను భారత్ లో పెట్టాలని ఆసక్తి చూపుతున్నాయని నిపుణులు చెప్పడానికి కారణం కూడా అంతర్జాతీయంగా భారత్ నాడు ప్రవర్తించిన విధానమే. అది స్వాభావికంగా దేశానికి ఉన్నదే, అందుకే భారత్ ఎప్పటిలాగానే అత్యవసర పరిస్థితిలో అందరికి సాయం చేయగలిగింది. కానీ ఈసారి అత్యవసర పరిస్థితి ఒక్కరికో ఇద్దరికో వచ్చింది కాదు, యావత్ ప్రపంచానికి వచ్చింది, అయినా భారత్ నిలదొక్కుకొని, ప్రపంచానికి తగిన సాయం చేయగలిగింది. కరోనా సమయంలో మొదటి దఫాలో ఆయా దేశాలకు తగిన కరోనా సామాగ్రిని అందించడంలో సఫలీకృతం అయ్యింది. తరువాత దఫాలో స్వయంగా తడబడినప్పటికీ, నిలదొక్కుకొని, ఎన్నో దేశాలకు టీకాల పంపిణి చేయగలిగింది.

ఎంతో అభివృద్ధి చెందాం అన్న దేశాలు కూడా ఆయా పరిస్థితులలో కనీసం స్పందించలేకపోయాయి. కానీ భారత్ ఒక్కటే ధీటుగా అందరికి అండగా నిలబడినట్టుగా ఉండగలిగింది. అది ప్రపంచానికి కాస్త ధైర్యాన్ని నూరిపోసిందనే చెప్పాలి. ఈ పరిస్థితులన్నీ భారత్ పై ప్రపంచ దేశాలకు ఉన్న అభిప్రాయాన్ని మెరుగుపరిచాయి. అందుకే తాజాగా ఇంటర్ పోల్ లో భారత దర్యాప్తు సంస్థ సంబంధింత అధికారికి స్థానం దక్కింది. అంటే భారత్ కు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అక్కడ సముచిత స్థానం ఇస్తుంది అంతర్జాతీయ సమాజం. చైనా, కొరియా, జోర్దాన్, సింగపూర్ లు కూడా ఈ పదవి కోసం పోటీ చేయగా భారతీయుడికి విజయం దక్కింది. ఇది స్వాగతించదగింది. భారత్ ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: