అందరు కలిసి నడవాల్సిన సందర్భంలోను కుట్రలు కుతంత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి కొన్ని దేశాలు. దీనితో అసలే కరోనా తో సతమతం అయి ఉన్న దేశాలు, ఈ కుట్రలకు తగిన సమాధానం చెప్పడానికి కూడా ప్రత్యేకంగా సమయం, కొన్నిసార్లు ఆర్థిక పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఉన్న దేశాలను చుస్తే చాలు కొన్ని దేశాలకు మనసులో విషం బయలుదేరుతుంది. దానితో ఆయా దేశాలపై వ్యూహాత్మకంగా కుట్రలు చేస్తూ, వాళ్ళు ఏడుస్తుంటే నవ్వుకుంటూ బ్రతికేస్తున్నారు. అలాంటి దేశాలు ఇంకా బ్రతికే ఉన్నాయని చెప్పడం వృధా. ఏదో ఉన్నాయంటే ఉన్నాయి, అక్కడి ప్రజల బ్రతుకు కూడా అంతే. ప్రస్తుత పరిస్థితులలో ఒకరికి ఒకరు సాయం అందించుకుంటూ చాలా దేశాలు ముందుకు పోతుంటే, కొన్ని దేశాలు మాత్రం ఇతర దేశాలను ఎలా ఏడిపించాలి, ఎలా ఆక్రమించుకోవాలనే చోటే ఆగిపోయాయి.

ఇవన్నీ ప్రపంచం చేస్తున్నప్పటికీ ప్రతిదానికి వాళ్ళు కూడా స్పందించడం కుదరదు. ఎవరి బాధలో వాళ్ళు ఉన్నప్పుడు, ఇతరుల బాధ గురించి ఆలోచించడం అందరికి సాధ్యం కాదు. కానీ అలా ఆలోచించగలిగే ఒక్కదేశం భారత్. అందుకే కరోనా సమయంలో కూడా తాను ఒకపక్క బాధను అనుభవిస్తూ ఇతర దేశాలకు చేయాల్సినది చేస్తూనే ఉంది. ఇది చూసి ఓర్వలేని కొందరు దేశంపై కుట్రలు మొదలుపెట్టారు. మొదటి నుండి ఉగ్రభూతాలను పెంచి పోషిస్తున్న దేశాలలో ప్రథమస్థానంలో ఉన్న పాక్, ప్రస్తుతం దానికి తోడైన చైనా, మరియు ఇతర తాలిబన్ వర్గాలు. వీరందరికి కాల్చుకు తినడానికి ప్రతిసారి ఓ కొత్త దేశం కావాలి. అందుకు వాళ్ళ ముందు ఉన్న ప్రస్తుత లక్ష్యం భారత్.

దానిని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనేది వాళ్ళ కుట్ర. అందుకే ఎన్నడూ లేని చొరబాట్లు, మాదకద్రవ్యాల సరఫరా ఇలా ఒక్కటేమిటి, ఏఏ దారులు ఉన్నాయో అన్ని దారులలో వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అన్నిటిని గమనిస్తూనే కరోనా నుండి కోలుకుంటుంది భారత్. తాజాగా పంజాబ్ లో హిందూ నేతలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రభూతాలు రక్తపాతానికి సిద్ధం అయినట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ చర్యలకు పాల్పడాలని వాళ్ళు ప్రణాళికలు రచించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఖలిస్థాన్ తీవ్రవాదాన్ని పాక్ ప్రేరేపిస్తూ, ప్రత్యేక పంజాబ్ నినాదాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. అక్కడ అనిచ్చితి తేవడం ద్వారా మరో ఆఫ్ఘన్ ను తయారుచేయాలని పాక్ తీవ్రవాదులతో కలిసి కుట్రలు చేస్తుంది. భారత్ ఒకపక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం సహా ఇలాంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తుంది. తప్పు లేకపోయినా ఇంకెన్నాళ్లో ఈ రక్తపాతం.

మరింత సమాచారం తెలుసుకోండి: