బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టింది అని తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. పఠాన్ చేరు లో మెదక్ స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 1072 ఓట్లు ఉంటే.. టీ ఆర్ ఎస్ పార్టీకి 777 సభ్యుల మద్దతు ఉంద‌ని, బలం లేకపోయినా కాంగ్రెస్ పోటీలో ఉంది అని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వo రూ.500 కోట్లను స్థానిక సంస్థల కోసం కేటాయించింద‌ని.. కానీ, కేంద్రంలోని
బీజేపీ ప్ర‌భుత్వం  స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని, బీజేపీ హయాంలో
సిలిండర్ ధర 1000 రూపాయలకు చేరింది అని విమ‌ర్శించారు. కోతలు, వాతలు తప్ప బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీలేదు అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు ధాన్యం కొనుగోలు పై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నార‌ని, కానీ..కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో వడ్లు ఎందుకు కొనడం లేదని ప్ర‌శ్నించారు.

 సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు టీ ఆర్ ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి ని MLC గా గెలిపించాలని కోరారు. పఠాన్ చేరు లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో నిర్మాణం చేస్తాం అని హామి ఇచ్చారు. అలాగే డిసెంబర్ వరకు అందరు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాల‌ని అధికారుల‌కు ఆదేశించారు.

 అనంత‌రం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి , పరస్పరం సహకరించుకుంటూ ఓకే అభ్యర్థి ని పోటీకి పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు
ఢిల్లీ లో ఒక‌లా... రాష్ట్రంలో మరోలా ద్వంద నీతి ని పాటిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్- బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ తో ఎన్నికల్లో పోటీలో నిలిపారు అని విమ‌ర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: