వచ్చే ఏడాది మార్చి నెలలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికల్లో 400 సీట్లు ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు... 40 సీట్లు మాత్రమే ఉన్న గోవా రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలు అన్ని ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో సత్తా చాటేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు యూపీ ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్దం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో చిన్న రాష్ట్రమైన గోవాపై ఇప్పటికే కొన్ని ప్రాంతీయ పార్టీలు కన్నేశాయి. గోవాలో అధికారం చేపట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. గోవాలో పాగా వేసేందుకు ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే మెగా ప్లాన్ వేస్తున్నాయి. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం కోసం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ తో కలిసి ఆప్ పొత్తు పెట్టుకుంది. ఇక పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఆప్ రెడీ అయ్యింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కూడా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దిశా నిర్దేశం చేశారు కూడా. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో కూడా స్వయంగా పాల్గొనేందుకు కేజ్రీవాల్ ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్... రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నట్లు మోదీ చేసిన ప్రకటనపై కూడా విమర్శలు చేశారు. ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రకటన చేశారని ఆరోపించారు. త్వరలోనే గోవాలో కూడా పర్యటించి... అక్కడ కూడా అధికార బీజేపీని ఓడించాలని పార్టీ కార్యకర్తలను సూచించారు కేజ్రీవాల్. గోవాలో ప్రధానంగా నిరుద్యోగుల ఓట్లపైనే ఆప్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: