రాజ‌ధాని రాజ‌కీయాల‌కు సంబంధించి ఎవ‌రి త‌ర‌హాలో వారు త‌మ వాద‌న‌ను వినిపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల మ‌ధ్య వాగ్వాదం కొన‌సాగుతూనే ఉంది. మూడు పంట‌లు పండుతున్న నేల‌ను ఆ రోజు లాక్కొని మా భూములు అభివృద్ధి పేరుతో గుంజుకుని ఇప్పుడిలా త‌మ‌ను రోడ్డున ప‌డేశార‌ని రాజ‌ధాని రైతు ఆందోళ‌న చెందుతున్నాడు.క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నాడు. ఒక‌ప్పుడు తాము హాయిగా బ‌తికేవార‌మ‌ని, ఉన్నంత‌లో తిని ఉన్నంత‌లో బ‌తికి హాయిగానే ఉండేవార‌మ‌ని ఇప్పుడు మాత్రం అలా లేమ‌ని ఆవేద‌న చెందుతున్నారు. నెల‌ల త‌ర‌బ‌డి తాము  పోరాటాలు చేస్తున్నా ప‌ట్టించుకోని  ప్ర‌భుత్వం ఇక త‌మ‌ను అనాథల్లా వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించుకుందా అని ప్ర‌శ్నిస్తున్నారు.

రాజ‌ధాని రైతులంతా ఇవాళ ఇదే త‌ర‌హాలో నిర్వేదంతోనే ఉన్నారు. భూములు ఇచ్చిన పాపానికి ఆ రోజు క‌మ్మ సామాజిక‌వ‌ర్గంకు చెందిన కొంద‌రు నేత‌లు త‌మ‌ను ప్ర‌లోభ‌పెట్టి భూములు లాక్కొన్న పాపానికి తాము ఏ విధంగా బ‌లి అయిపోయామో అన్న‌ది వివ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ రెడ్లు కూడా భూములు కొనుగోలు చేశారు అన్న‌ది వాస్త‌వ‌మేన‌ని  తెలుస్తోంది. టీడీపీ రెడ్లు వైసీపీ రెడ్లు క‌లిసి కొంతలో కొంత ఇక్క‌డ హ‌వా న‌డిపార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. జ‌గ‌న్ కోపం అంతా క‌మ్మ సామాజిక‌వ‌ర్గంపైనే క‌నుక ఆయ‌న ఒప్పుకోవ‌డం లేదు. దీంతో ఉన్నంత‌లో ఏదో ఒక రేటుకు అమ్మ‌కుని విశాఖ‌లో సెటిలైపోదాం అనుకుంటున్న వైసీపీ రెడ్ల‌కు కూడా ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.

ఓ మాట‌లో చెప్పాలంటే జ‌గ‌న్ ఎవ్వ‌రినీ బ‌త‌నివ్వ‌డం లేదు అన్న‌ది తేలిపోయింద‌ని, అందుకు రుజువే వ‌రుసగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు అని ఆయ‌న ఉద్దేశంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఆర్థిక మూలాలు పూర్తిగా  లేకుండా చేయ‌డ‌మో లేదా క‌మ్మ సామాజిక వ‌ర్గ సంస్థ‌ల మ‌నుగ‌డ లేకుండా చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి నుంచి గ‌ట్టిపోటీ లేకుండా చేసుకోవ‌డ‌మే ఓ ప్ర‌ధాన ఎత్తుగ‌డ అన్న వాద‌న ఒక‌టి టీడీపీ నుంచి వినిపిస్తోంది. ఇదే ద‌శ‌లో ఉత్త‌రాంధ్ర టీడీపీ కూడా అమ‌రావ‌తికే మ‌ద్ద‌తుగా ఉంటోంది.


అభివృద్ధి వికేంద్రీక‌రణ అన్న‌ది నాట‌కమేన‌ని తేల్చేసింది. వైసీపీ ప‌నులు ఎలా ఉంటాయంటే  అమ‌రావ‌తికి నామ‌రూపాలు లేకుండా చేసి విశాఖ భూముల రేట్ల‌కు రెక్క‌లు వ‌చ్చేలా చేయ‌డ‌మే ఆ పార్టీ ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని ఎందుకంటే ఇప్ప‌టికీ విశాఖ మ‌రియు విజ‌యన‌గ‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌లో వైసీపీ భూములు కొనుగోలు చేసి కోట్ల రూపాయ‌ల్లో లావాదేవీలు చేస్తోంద‌ని టీడీపీ వివ‌రిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: