పాకిస్తాన్ లో పరిస్థితి అందరికి తెలిసిందే. అక్కడ ప్రజల కంటే ఉగ్రస్థావరాలే ఎక్కువ, అందుకే దాదాపు అన్ని వైపులా నుండి ఆ దేశానికి సహాయక సహకారాలు నిలిపివేయబడ్డాయి. అందుకే కనీసం అప్పు కూడా పుట్టక పాక్ అల్లాడిపోతోంది. దానికి ఉన్న దారి మొత్తం చైనా మాత్రమే. అది కూడా వాడుకున్నంత కాలం వాడేసుకుని వదిలేసే రకం, అయినా అంతకంటే దిక్కులేక దాని పంచనే బ్రతికేస్తుంది పాక్. చైనా కూడా తాను పెట్టుబడులు పెట్టె విధానం మనకు తెలిసిందే. పెట్టుబడి పెట్టినట్టే పెట్టి, ఆయా దేశాలపై దురాక్రమణలకు పాల్పడుతుంది. అందుకే దాదాపు దేశాలు దాని పెట్టుబడులు కావాలని స్వాగతించబోరు. పాక్ కి వేరే దిక్కు లేకపోవడం వలన దానినే నమ్ముకుని బ్రతుకు వెల్లడిస్తుంది. ప్రస్తుతం చైనా పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే ఉండటంతో పాక్ బాహాటంగానే తాము దివాళా తీసేశాం అని చెప్పేసుకుంటున్నారు.

తాజాగా దానికి తగ్గట్టే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశాన్ని నడపడానికి కనీస ఆర్థిక స్థితి కూడా లేదని ప్రపంచానికి చాటేశారు. ఇలా చాటడం ద్వారా కాస్తోకూస్తో జాలి లభిస్తుందని ఆశించి ఉండవచ్చు. అయినా తీవ్రవాదులకు నెలవుగా ఉన్న దేశంగా గుర్తించబడిన పాక్ లో పెట్టుబడులు పెట్టి నసపొవడానికి ఎవరు  మాత్రం ముందుకు వస్తారు. అందుకే దాదాపుగా అప్పులు తీసుకోవడం తప్ప పెట్టుబడులు ఆ దేశానికి పెద్దగా ఏమి ఉండబోవు. ఒకవేళ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ ఏ తీవ్రవాద సంస్థకు బయపడో వారి ప్రభావం వలననో వచ్చినట్టు బావించాల్సిందే. ఎందుకంటే చూసిచూసి ఎవరూ కూడా వ్యాపారం నష్టాలకు పెట్టుకోలేరు కదా. ప్రస్తుతం ఆఫ్ఘన్ కంటే మెరుగ్గా ఏమి లేదు పాక్ పరిస్థితి.

అయితే తాజాగా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని పాక్ ప్రకటించుకుంది. అది కూడా మతపరమైన పెట్టుబడిగానే కనిపిస్తుంది. ముందుగా చెప్పుకున్నట్టుగా ఏ తీవ్రవాద సంస్థ బెదిరింపులకు లోబడి ఈ పెట్టుబడి వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉన్న పాక్ లో పెట్టుబడులు పెట్టి ఎవరు నష్టాలు కొని తెచ్చుకుంటారు అనేది వాస్తవం. అజర్ బైజాన్ పాక్ లో పెట్టుబడి పాక్ లో పెట్టేందుకు సిద్ధం అయ్యిందని పాక్ చెప్పుకుంటుంది. మతపరమైనదే అని చెప్పడానికి ఇదే ప్రాతిపదిక. మతపరంగా ఆయా దేశాలను ఉగ్రసంస్థలు ఏకం చేయడం లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టే ఉంది. అప్పుడు మతపరంగా దేశాలమధ్య చిచ్చు పెట్టడానికి వాళ్లకు కాస్త వెసులుబాటు లభిస్తుంది అన్నది వాళ్ళ వ్యూహం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: