ప్ర‌స్తుతం వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన సీమ ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పర్య‌టిస్తు న్నారు. వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఇక్క‌డే ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని నిర్ణ‌యించు కున్నారు. తొలుత క‌డ‌ప‌లో ప‌ర్య‌టించారు. రెండో రోజు చిత్తూరులో పర్య‌టించారు. నెల్లూరులోనూ షెడ్యూ ల్ చేసుకున్నారు. ఇక్క‌డ చంద్ర‌బాబు ఉద్దేశం ఏంటంటే.. వ‌ర‌ద‌లు వ‌చ్చి.. ప్ర‌జ‌లు కొట్టుకుపోయినా.. ఇళ్లు కూలిపోయినా.. వారికి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి భ‌రోసా ల‌భించ‌లేద‌ని చెప్ప‌డ‌మే. అదేస‌మ యంలో గ‌తంలో తాను ఎలా ఆదుకున్న‌ది ఆయ‌న వివ‌రించ‌డ‌మే.

కుదిరితే ఈ సంద‌ర్భంగా బాధితుల‌కు ఏదైనా సాయం చేయ‌డ‌మే! అయితే.. ఇక్క‌డే చంద్ర‌బాబు గాడి త‌ప్పార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బాధిత ప్రాంతాల‌కు వెళ్లిన చంద్ర‌బాబు.. కొంద‌రిని ప‌రామ‌ర్శిస్తు న్నారు. అదే స‌మయంలో బాధితుల‌ను ఉద్దేశించి.. ఆయన ప్ర‌సంగిస్తున్నారు. అయితే.. ఈ ప్ర‌సంగాల్లో వారికి మ‌నోధైర్యం నింపే మాట‌లు చెప్పి.. వారి క‌న్నీళ్లు తుడిచేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లువ‌స్తున్నాయి.

ఎక్క‌డికి వెళ్లినా.. ఏ జిల్లాలో ప‌ర్య‌టించినా.. త‌న‌ను, త‌న భార్య‌ను అవ‌మానించారంటూ.. అసెంబ్లీలో ఇలా జ‌రిగింద‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో స‌భ‌కు వ‌చ్చిన వారు.. నివ్వెర పోతున్నారు. కొంద‌రైతే.. మ‌హిళ‌లు క‌న్నీరు పెట్టుకుంటున్నారు. దీంతో వారి భ‌ర్త‌లు వ‌చ్చి.. వారిని ఓదారుస్తున్నార‌ట‌. మ‌రికొంద‌రు మ‌హిళ‌లు..అసెంబ్లీలో ఏం జ‌రిగిందంటూ.. అక్క‌డే ఆరాతీస్తున్నార‌ట‌. మ‌హిళ్ల‌లో కూడా ఈ ప్ర‌శ్న‌లు రైజ్ అవుతూ ఉండ‌డం ఇప్పుడు చంద్ర‌బాబు తో పాటు పార్టీ వ‌ర్గాల్లోనూ షాకింగ్ గా మారింది.

మొత్తంగా చూస్తే.. ప్ర‌జ‌ల‌ను ఓదార్చేందుకు.. వ‌ర‌ద ప్రాంతాల్లో బుర‌ద‌ను కూడా లెక్క‌చేయ‌కుండా తిరుగుతున్నా..చంద్ర‌బాబు ఆశించిన మైలేజీ పొంద‌లేక‌పోవ‌డం.. ఒక భాగ‌మైతే.. ఎవ‌రిని ఓదార్చేందుకు వెళ్లి.. ఎవ‌రు ఓదార్పు పొందుతున్నారంటూ..ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి మ‌రొక‌టి. మొత్తంగా.. ఎవ‌రిని ఓదార్చాలి .. బాబు.. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్నా.. మీరు ప్ర‌జ‌ల‌నా? అనే ప్ర‌శ్న‌లు మాత్రం తెర‌మీదికి వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: