ఇప్పటికే జల వివాదాల్లో ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సహకరించారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు సీఎంల‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జ‌ల వివాదాల్లో ఎవ‌రికి వారు ఎ త్తులు, పై ఎత్తుల‌తో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇద్ద‌రూ కూడా పంతానికి పోతున్నారు. తాజాగా ఇప్పుడు ఏపీ - తెలంగాణ మధ్య మరో వివాదం మొదలైంది. తెలంగాణలోకి కర్నూలు జిల్లా నుంచి వడ్లను అనుమతించడం లేదని తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఫుట్లూరు టోల్గేట్ వద్ద క‌ర్నూలు నుంచి తెలంగాణ లోకి వెళుతోన్న వ‌డ్ల లారీల‌ను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ధాన్యం బాగా పడుతుంది. ఇక్కడ నుంచి తెలంగాణలోని పలు జిల్లాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఏపీ నుంచి వ‌చ్చే ధాన్యాన్ని తెలంగాణ లోకి అనుమ‌తించ‌వద్ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం పోలీసుల‌కు సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చేసింద‌ట‌.

అయితే తెలంగాణ‌కు ధాన్యం ఎగుమ‌తి చేస్తోన్న య‌జ‌మానులు మాత్రం త‌మ‌కు గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని.. ఇప్పుడే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి సీరియ‌స్ గా ఆదేశాలు ఉన్నాయ‌ని.. తాము మాత్రం తెలంగాణ లోకి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ధాన్యం లారీల‌ను అనుమ‌తించ‌మ‌ని చెప్పేస్తున్నారు.

ఇప్పుడు రాయ‌ల‌సీమ‌లో కురుస్తోన్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో తాము ధాన్యం ఇక్క‌డ నిల‌వ చేయ‌లేమ‌ని .. తెలంగాణ‌కు ఎగుమ‌తి చేయాల్సిందే అని ఇక్క‌డ వ్యాపారులు చెపుతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో కేంద్రంతో ఫైట్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఏపీ నుంచి వ‌స్తోన్న ధాన్యం ను అడ్డుకోవ‌డంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో స‌రికొత్త గొడ‌వ వ‌చ్చేలా ఉంది. మ‌రి దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో ?  చూడా లి.

మరింత సమాచారం తెలుసుకోండి: