కాంగ్రెస్ దేశానికి రాజకీయ నేర్పించిన పార్టీ. రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిన పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఇలాంటి సమయంలో దీదీ ముందుకచ్చారు.కాంగ్రెస్ బలహీనతను తన బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానాన్ని కబ్జా చేసేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో బిజెపి కి ఎదురు లేకుండా పోతోంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించ లేక పోతోంది. పార్టీ భారాన్ని సోనియా మోయలేక, రాహుల్ కు బాధ్యతలు అప్పగించ లేక, సీనియర్లను కట్టడి చేయలేక, వెళ్లిపోతున్న వారిని ఆపలేక, పార్టీని గాడిలో పెట్టలేక సోనియా అండ్ ఫ్యామిలీ పడుతున్న తికమక దేశ ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించుకునెందుకు దీదీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రేపిన ఉత్కంఠ అంతా ఇంతా కాదు. మోడీ, షా ద్వయాన్ని ఎదుర్కొని సూపర్ విక్టరీ కొట్టిన దీదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా టిఎంసిని విస్తరించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు రాష్ట్రాల కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని టీఎంసీ ఒక్కటే అనే భావన తీసుకొచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. మేఘాలయలో ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారంటే దీదీ రాజకీయ ఎత్తుగడలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతోంది. యూపీలో కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా  అడుగులు వేస్తున్నారు. అస్సాం, గోవాలో కాంగ్రెస్ కీలక నేతలు సోనియాకి టాటా చెప్పి టీఎంసీ లో చేరారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా మారుతుందా లేదా అనేది పక్కనపెడితే, కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకోవడం దీదీ కి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. హస్తం పార్టీ రోజురోజుకీ వీక్ అవుతుంటే టీఎంసీ బలంగా మారుతోందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: