తిరుపతి టెంపుల్ సిటీ వాసుల్లో అయోమయం నెలకొంది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయాందోళనలోనే బ్రతుకును వెళ్లదీస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా ప్రకృతి విపత్తులు ప్రజలందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి.ఇటీవలే తిరుపతి నగరాన్ని భారీగా వర్షాల కారణంగా వచ్చిన వరదలు ముంచెత్తాయి. తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా వరద నీరు నిండిపోవడంతో జనావాసాలు మొత్తం పెద్ద పెద్ద చెరువులను తలపించాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో ఊహించని విధంగా భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.


 అయితే ఇక ఇటీవల వరద ప్రభావం తగ్గినప్పటికీ తిరుపతిలోని కాలనీలన్నీ కూడా బురదమయంగా మారి పోయాయి. వరద నీరు నిలవడంతో స్థానికులు అందరూ కూడా అష్ట కష్టాలు పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇలా ఇటీవలే భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల కారణంగా నే అందరూ బెంబేలెత్తిపోయారు. ఇక ఇప్పుడు తిరుపతి వాసులందరికీ మరో భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టెంపుల్ సిటీ తిరుపతిలో శ్రీనగర్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా భూప్రకంపనలు అందరినీ భయాందోళనకు గురి చేశాయి. భూ ప్రకంపనలు కారణంగా కొన్ని ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న ట్లు తెలుస్తోంది.


 ఏకంగా 18 ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి బీటలు వారాయి. దీంతో పలు ఇల్లు ఎప్పుడు కూలుతాయో కూడా తెలియక స్థానికులు అందరు భయాందోళనలో మునిగిపోయారు. అయితే వరుసగా ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నప్పటికీ రాజకీయ నాయకులు మాత్రం కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు భారీ వర్షాలు ఉన్నాయ్ అంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో చిత్తూరు జిల్లా యంత్రాంగం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అయితే ఇటీవల భూప్రకంపనలు రావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ttd