వివాదాస్పద ఉగ్రవాద నిరోధక చట్టం కింద జర్నలిస్టులు, న్యాయవాదులపై నమోదైన కేసులను సమీక్షించాలని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్  శనివారం త్రిపురలోని ఉన్నతాధికారులను కోరారు.
 త్రిపురలో గత మాసంలో జరిగిన హింసకు సంబంధించిన నకిలీ విజువల్స్‌ను పంచుకున్నారనే ఆరోపణలతో న్యాయవాదులు,  జర్నలిస్టులతో సహా 102 మందిపై ఇటీవల చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్లతో అభియోగాలు మోపారు, ఇది రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందని  పోలీసులు పేర్కొన్నారు.
తమపై ఉన్న యూఏపీఏ కేసులను రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు నవంబర్ 17న రిలీఫ్ ఆర్డర్ ఇచ్చింది. త్రిపుర కాలిపోతోంది' అని  సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టిన జర్నలిస్ట్ శ్యామ్ మీరా సింగ్‌పై అభియోగాలు మోపారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు అన్సార్ ఇండోరి (నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ) తో పాటు, ముఖేష్ (పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్  ) ఒక స్వతంత్ర నిజనిర్ధారణ బృందంలో వీరు సభ్యులుగా ఉన్నారు, వారు రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసి నివేదికను ఇచ్చారు. దీంతో త్రిపుర ప్రభుత్వానికి  కోర్టు నోటీసు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ముగ్గురిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులతో ముఖ్యమంత్రి ఖంగు తిన్నారు. తన సిబ్బంతో సమావేశం అయ్యారు. పోలీసు అధికారులతో మాట్లాడారు. అదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.ఎస్. యాదన్, ఉత్తర్వులు జారీ చేశారు. యూఏపీఏ కింద న్యాయవాదులు, జర్నలిస్టులపై నమోదైన కేసులను సమీక్షించాలని త్రిపుర పోలీసు క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌ను వి.ఎస్  యాదవ్ అదేశించారు.

త్రిపుర ప్రభుత్వం పౌర హక్కుల సంఘాలను,  పాత్రికేయులను నిశ్శబ్దంగా అణగదొక్కుతోందని  అక్కడి పౌర సమాజం ఆరోపిస్తోంది. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని  పాత్రికేయులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తాజాగా  అదేశాలు జారీ చేశారు.
మరింత సమాచారం తెలుసుకోండి: