జిల్లా నుండి ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు. మండలిలో ఆ జిల్లా కు ఎక్కువ ప్రాధాన్యత దక్కిందా..? మండలిలో తెలంగాణలో ఏ ఇతర జిల్లాకు రానంత ప్రాధాన్యం వరంగల్ జిల్లాకు వచ్చిందా అంటే అవుననే టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల్లో సింహభాగం ఓరుగల్లుకే దక్కాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలుగా ఉన్న జిల్లాగా వరంగల్ కు గుర్తింపు వచ్చింది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది  కి వరంగల్ నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు గులాబీ అధినేత. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న వరంగల్  జిల్లా టిఆర్ఎస్ నేతలకు పదవుల పంట పండుతోంది. ప్రతి సందర్భంలోనూ సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా నేతలకు అవకాశాలు ఇస్తుండగా తాజాగా ఎమ్మెల్సీ ఎంపికలోనూ వరంగల్ ఉమ్మడి జిల్లా కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ కోటా లో ముగ్గురికి అవకాశం కల్పించారు.

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఎమ్మెల్సీగా అవకాశం పొందారు. అలాగే టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ కానున్నారు. ఇక స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న  ఎమ్మెల్సీ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. పూర్తి ఆదిక్యం లో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపు లాంఛనమే కానుంది. కొత్తగా అవకాశం పొందిన ఈ నలుగురితో పాటు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మరో ముగ్గురు ఎమ్మెల్సీలు గా ఉన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గా ఉన్న సత్యవతి రాథోడ్,బస్వరాజ్ సారయ్య ఎమ్మెల్యే కోటా లోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూవెట్స్ ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ఏడాది ఎన్నికయ్యారు. మూడు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే రాజేశ్వర్ రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినవారే. తాజాగా ఎన్నిక అవుతున్న వారితో కలిసి ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గా ఉండనున్నారు. దీంతో శాసనమండలిలో వరంగల్ జిల్లా ఆధిపత్యం కనిపిస్తుందనే టాక్ వినిపిస్తోంది. వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది రాజకీయ పదవులు పొందడం వెనుక కెసిఆర్ టిఆర్ఎస్ కార్యకర్తలకు ఒక సందేశం ఇచ్చేలా చేశారని  స్థానిక నేతలు చెబుతున్నారు. కెసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకుచాలా ప్రాధాన్యత ఇస్తూ ఆ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారట. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో జిల్లా నేతలకు అవకాశం  పైనే చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: