మొన్నటివరకూ కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఎంత అల్లాడిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక దేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ బారినపడి దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నాయ్. మొదటి దశ కరోనా వైరస్ ముగిసిందో అంతలోనే రెండో దశ కరోనా వైరస్ కూడా ముంచుకొచ్చింది. దీంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా అన్ని దేశాలలో కఠిన ఆంక్షలు అమలులోకి వస్తున్నాయ్. అయితే ప్రస్తుత సమయంలో మాత్రం కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గడంతో..  ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు ఆంక్షలు కూడా సడలింపు ఇస్తూ ఉండడం గమనార్హం.



 అదే సమయంలో మొన్నటివరకు ఆంక్షల పరిధిలో మాత్రమే కార్యకలాపాలు జరుపుకున్న అన్ని దేశాలు ఇప్పుడుప్రపంచ దేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలను మళ్లీ పునః ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న అన్ని రకాల వ్యవస్థలు కూడా ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కారణంగా గత రెండు సంవత్సరాలలో కూడా ఎంతోమంది భారతీయులు అమెరికాలో ఇరుక్కు పోయారు అన్న విషయం తెలిసిందే భారత్ లో ఉన్న కుటుంబ సభ్యులను చూడాలని ఉన్నప్పటికీ కూడా కరోనా వైరస్ నిబంధనల వల్ల రాలేని పరిస్థితి నెలకొంది.


 కాగా ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గి ఆంక్షలలో కూడా సడలింపు ఇస్తూ ఉండడం తో ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం వ్యాపారం చేస్తున్న ఎంతో మంది భారతీయులు స్వదేశంలో కుటుంబ సభ్యులు కలవడానికి తరలి వస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక భారత్ నుంచి అమెరికా కి వెళ్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అన్న విషయం బయటపడింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ కి నాన్ స్టాప్ గా విమానాలు నడుపుతుంది అమెరికా ప్రభుత్వం. ఇక ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: