వర్ల రామయ్య...తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. పేరుకు సీనియర్ నేతగానీ ఈయన వల్ల పార్టీకి పావలా ప్రయోజనం లేదనే చెప్పాలి. పైగా పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. ఈయన సలహాల వల్ల పార్టీకి ఒరిగే ప్రయోజనం కనబడటం లేదు. పైగా ఈయన వల్ల పార్టీకే డ్యామేజ్ జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వర్ల..ఎన్టీఆర్ విషయంలో ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే. భువనేశ్వరి ఇష్యూలో ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని చెబుతూ...ఆయనపై విమర్శలు చేశారు.

అసలు ఏదొరకంగా ఎన్టీఆర్ స్పందించారని వదిలేయకుండా వర్ల కాస్త హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అంటే చంద్రబాబు దృష్టిలో ఇంకా పడాలని చేశారా లేక జనంలో ఏదో సాధించామని చెప్పాలని అనుకున్నారో తెలియదు గానీ, ఎన్టీఆర్‌ని విమర్శించి పెద్ద తప్పే చేశారు. ఈయన మాటల వల్ల టీడీపీలో రెండు గ్రూపులు వచ్చేశాయి. ఎన్టీఆర్ మద్ధతుదారులు, టీడీపీ మద్ధతుదారుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతకాలం టీడీపీకి సపోర్ట్‌గా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు బయటకెళ్లే పరిస్తితి వచ్చింది.

దీని వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం జరిగే ప్రసక్తి లేదు. పైగా వర్ల వల్ల పామర్రు నియోజకవర్గంలో టీడీపీకి ఇంకా డ్యామేజ్ జరిగేలా ఉంది. అసలు సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అయిన పామర్రులో టీడీపీ ఇంతవరకు గెలవలేదు. ఈ సారైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. పైగా పామర్రు ఇంచార్జ్‌గా వర్ల తనయుడు కుమార్ రాజా ఉన్నారు. ఈయనే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు.

మరి అలాంటప్పుడు వర్ల ఎంత జాగ్రత్తగా రాజకీయం చేయాలి. అలా కాకుండా ఎడాపెడా జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు చేశారు. దీని వల్ల పామర్రులో టీడీపీ కార్యకర్తలు హార్ట్ అయ్యే పరిస్తితి వచ్చింది. ఇప్పుడు వారు...వర్లపై గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పటికైనా వర్ల దీనిపై క్లారిటీ ఇచ్చి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతించేలా చేస్తే బెటర్..లేదంటే పామర్రులో నెక్స్ట్ వర్ల ఫ్యామిలీకే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి: