ఎక్కడైనా రాజకీయ నాయకులు అధికార పార్టీలోకి వలస వెళ్తారు. లేదా ఎన్నికల సమయంలో పరిస్తితులు బట్టి నాయకులు నచ్చిన పార్టీలోకి వెళ్తారు. కానీ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం ఉండగానే ఏపీలో రివర్స్ జంపింగులు మొదలయ్యాయి. మొన్నటివరకు అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే వచ్చాయి. అయితే తాజాగా టీడీపీలోకి కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన తనయుడు భూపేష్ రెడ్డిలు జాయిన్ అయ్యారు.

జమ్మలమడుగుకు చెందిన ఈ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి రాగానే భూపేష్ రెడ్డికి చంద్రబాబు, జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది...కానీ వచ్చే ఎన్నికల ముందు టీడీపీలోకి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వస్తే పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేకుండా ఉంది. నారాయణరెడ్డి...ఆదినారాయణరెడ్డి సోదరుడు అనే సంగతి తెలిసిందే.

మూడుసార్లు జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆది..గత చంద్రబాబు ప్రభుత్వం సమయంలో టీడీపీలో చేరి మంత్రి అయిన విషయం తెలిసిందే. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఆది..కడప ఎంపీగా పోటీ చేశారు. అటు జమ్మలమడుగులో టీడీపీ తరుపున రామసుబ్బారెడ్డి పోటీ చేశారు. జగన్ గాలిలో ఇద్దరూ ఓడిపోయారు. ఓడిపోయాక ఆది..బీజేపీలోకి వెళ్ళిపోయారు. రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో జమ్మలమడుగులో టీడీపీకి నాయకులు లేకుండా పోయారు. తాజాగా ఆది సోదరుడు నారాయణరెడ్డి..తన తనయుడు భూపేష్ రెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. అలాగే భూపేష్‌కు జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు.

అయితే నెక్స్ట్ ఆది...బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవు. ఆయన పార్టీ మారాల్సిన పరిస్తితి ఉంటుంది. అప్పుడు ఆది..టీడీపీలోకి వస్తే జమ్మలమడుగు సీటు ఇస్తారా? అనేది డౌట్. కాకపోతే ఇంచార్జ్‌గా సోదరుడు కుమారుడు ఉన్నారు కాబట్టి, నెక్స్ట్ ఆదికి సీటు దక్కించుకోవడం ఈజీనే అని తెలుస్తోంది. అసలు ఆదినే...సోదరుడుని టీడీపీలోకి పంపించారనే టాక్ ఉంది. మరి చూడాలి నెక్స్ట్ జమ్మలమడుగు రాజకీయం ఎలా మారుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: