వైసీపీ కంచుకోటగా ఉన్న కడపలో తెలుగుదేశం పార్టీ ఈ సారి గట్టిగానే కష్టపడుతుంది. వైసీపీ కంచుకోటల్లో టీడీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నాయకులు బాగానే కష్టపడుతున్నారు. కాకపోతే కడపలో టీడీపీ జెండా ఎగరవేయడం అనేది చాలా కష్టమే అని చెప్పాలి. రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే కడపలో మాత్రం వైసీపీకే అనుకూలంగా రాజకీయంగా నడుస్తోంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కడప ప్రజలకు వైఎస్సార్ ఫ్యామిలీ అంటే అంత అభిమానం.

అందుకే గతంలో కడపలో కాంగ్రెస్ జెండా ఎగిరితే...గత రెండు ఎన్నికలుగా కడపలో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా కడపలో వైసీపీ హవా నడుస్తుంది...అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదనే చెప్పొచ్చు. అయితే కాస్త వైసీపీ హవా తగ్గించాలని టీడీపీ బాగానే కష్టపడుతుంది. వైసీపీని డామినేట్ చేయకపోయినా, కనీసం ఒకటి, రెండు సీట్లు గెలుచుకుంటే చాలు అనే భావనలో కడప టీడీపీ నేతలు ఉన్నారు.

అయితే కడపలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బాగానే కష్టపడుతున్నారు. వైసీపీకి పూర్తిగా ఛాన్స్ ఇచ్చేయకుండా గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. పులివెందులలో ఎలాగో బీటెక్ రవి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ గెలవకపోయినా కనీసం జగన్ మెజారిటీ తగ్గించాలని రవి ట్రై చేస్తున్నారు. అటు కమలాపురంలో జగన్ మేనమామ రవీంద్రారెడ్డికి చెక్ పెట్టాలని టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి పనిచేస్తున్నారు.

ఇటు మైదుకూరులో వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిని ఈసారి ఎలాగైనా ఓడించాలనే కసితో పుట్టా సుధాకర్ యాదవ్ పనిచేస్తున్నారు. ఈ సీటుపై టీడీపీ అసలు పెట్టుకోవచ్చు. అలాగే రాజంపేటలో టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు, ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డిలు బాగానే పనిచేస్తున్నారు. తాజాగా జమ్మలమడుగు ఇంచార్జ్‌గా భూపేష్ రెడ్డిని పెట్టారు. ఇలా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: