కొడాలి నానిపై టీడీపీ శ్రేణులు ఎంత గుర్రుగా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జగన్‌పై ఎంత కోపంగా ఉందో తెలియదు గానీ, అంతకంటే ఎక్కువగా కొడాలిపైనే కోపం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కొడాలి నాని..టీడీపీకి ఏ విధంగా చుక్కలు చూపిస్తున్నారో తెలిసిందే. టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి, ఆ పార్టీ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి...ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి....మంత్రి అయ్యి ఏ విధంగా చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే.

చంద్రబాబు రాజకీయ జీవితంలో నాని తిట్టినట్లుగా మరొక నాయకుడు బాబుని తిట్టలేదనే చెప్పాలి. మంత్రి అయిన దగ్గర నుంచి నాని ఏ స్థాయిలో బాబు, లోకేష్‌లని తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే టీడీపీ శ్రేణులు నానిపై బాగా కోపంగా ఉన్నారు. అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా నానికి కౌంటర్లు ఇస్తున్నారు గానీ, నానికి మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. అయితే నానికి చెక్ పెట్టాలంటే ఒకటే మార్గం ఉంది...గుడివాడలో ఓడిస్తే గానీ కాస్త నాని సైలెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయనని ఓడించలేకపోతే టీడీపీకి ఇంకా చుక్కలు కనబడతాయి. మరి గుడివాడలో నానీని ఓడించే స్థాయిలో టీడీపీ ఉందా? అంటే అసలు లేదనే చెప్పాలి.

అసలు గుడివాడలో టీడీపీ పరిస్తితి అసలు బాగోలేదు. కాకపోతే టీడీపీ బలం పూర్తిగా మాత్రం తగ్గలేదు. గుడివాడలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో అది కనబడింది. వైసీపీకి గట్టిగానే పోటీ ఇచ్చింది. కానీ పై స్థాయిలో నాయకుడే బలంగా లేడు. రావి వెంకటేశ్వరరావు ఇంకా సైలెంట్‌గానే ఉన్నారు. ఆయన సైలెంట్‌గా ఉండటం వల్లే గుడివాడలో టీడీపీకి నష్టం ఎక్కువ ఉంది.

అలా కాకుండా ఆయన ప్రజల్లోకి వచ్చి..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే...నానీని ఓడించడానికి మంచి ఛాన్స్ దొరికినట్లు అవుతుంది. కానీ ఆ ఛాన్స్‌ని రావి ఉపయోగించుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: