వచ్చే ఏడాది మార్చి నెల దేశంలోన్ని అన్ని ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. 400 సీట్లు ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు... 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీల గడువు కూడా పూర్తి కానుంది. దీంతో అన్ని పార్టీలు తమ దృష్టిని ఎన్నికలపై నిలిపాయి. ప్రస్తుతం తమ చేతుల్లో ఉన్న పంజాబ్‌ను తిరిగి దక్కించుకుంటామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలను కూడా దక్కించుకునేందుకు హస్తం పార్టీ గట్టి ప్రణాళిక వేస్తోంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో... ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో వీరిలో పది మందికి మరోసారి అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. అభ్యర్థుల విజయానికి అంతా కలిసి కృషి చేయాలని కూడా నేతలు సూచిస్తున్నారు.

ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి అంశాలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో పోటి చేసిన విజయం సాధించిన వారికి పది మందికి తిరిగి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిది. అలాగే పార్టీ సీనియర్ నేతలకు టికెట్లు ఇవ్వాలని కూడా స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. 2017 ఎన్నికల్లో మోడీ హవాతో సీనియర్ నేతలు కూడా ఓడారు. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 57 స్థానాల్లో గెలవగా... కాంగ్రెస్ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడారు. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. అందుకోసం ఆ ప్రాంతాల్లో సీనియర్ నేతలకే అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ప్రధానంగా పితోర్‌గఢ్, అల్మోరా, గంగోత్రి, దేవ్ ప్రయాగ్, తెహ్రీ నియోజకవర్గాల్లో మాజీలకే టికెట్ ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ భావిస్తోంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: