బీజేపీ కరోనా సమయంలో రైతుల కష్టనష్టాలు చూడటంతో వారికి మేలు జరిగేందుకు కొత్త చట్టాలు తెచ్చింది. అయితే దానిపై విపక్షాలు యాగీ చేసి రైతు ఉద్యమాన్ని కూడా నడిపించాయి. అయితే ఇది ఒట్టి రైతు ఉద్యమం అని ముందుగా అనుకున్నప్పటికీ, అంతర్జాతీయంగా దీని వెనుక కుట్రలు ఉన్నాయని తరువాత తెలియవచ్చింది ప్రభుత్వానికి. రైతు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఢిల్లీలో రగడ జరగటంతో మొదటి అనుమానం రాగా దానిపై అప్పటి నుండి ఆరా తీయడం ఆరంభించింది ప్రభుత్వం. ముందస్తు దర్యాప్తులో అలాంటి కోణం ఉండవచ్చని అనుకున్నప్పటికీ దానికి దేశీయ కుళ్ళు రాజకీయాలు చేసే పార్టీలు కారణం అనుకున్నారు తప్ప అంతర్జాతీయ కుట్రలు ఉన్నాయని భావించలేదు.

అయితే తాజా నివేదికలో రైతు ఉద్యమం లో కలిసిపోయి దేశాన్ని విచ్చిన్నం చేయాలని అనుకుని పాక్ ప్రేరేపిత ఖలిస్థాన్ లాంటి ఉగ్రభూతాలు కుట్రలు పన్నినట్టు తేలింది. దీనిపై ఇప్పటికే కేంద్రానికి సమగ్ర నివేదిక అందినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఖలిస్థాన్ ఉద్యమం అని పాక్ ఆయా ఉగ్రవాద ప్రభావాన్ని పంజాబ్ యువతపై(అదికూడా విదేశాలలో ఉన్న భారతీయ పంజాబ్ యువత మనసును చెదరగొట్టి)ప్రభావం చూపుతుంది. వాళ్లకు గతంలో జరిగిన పంజాబ్ ఘటనను మార్చి చెప్పి, లేనిపోనివి కల్పించి చెప్తూ వాళ్ళను ఖలిస్థాన్ తీవ్రవాదులుగా మారుస్తుంది. దానితో ప్రత్యేక పంజాబ్ లాంటి నినాదాన్ని లేవనెత్తింది. దీనితో భారత్ ను మరోసారి ముక్కలు చేయాలని పాక్ ఉద్దేశ్యం. ప్రస్తుతం ఆఫ్ఘన్ మాదిరి పంజాబ్ ను మార్చేయొచ్చనేది దాని ఆలోచన.

నిజానికి ఇదంతా తీవ్రవాదులు పాక్ ను అడ్డుపెట్టుకుని పన్నుతున్న కుట్రలు. భారత్ లో చొరబడటానికి వాళ్ళు అన్ని మార్గాలు పాక్ ద్వారానే వెతుక్కుంటున్నారు. అలాగే రైతు ఉద్యమంలో చొరబడ్డారు. ఢిల్లీలో లేనిపోని రగడ చేశారు. ఈవిషయాలపై అసలు ఏమీ అవగాహనా లేని రైతులు తమ నేతలు తమ కోసం ఈ ఉద్యమం చేస్తున్నారని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఈ విషయం ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని పక్కకు వచ్చేస్తే మంచిది. బహుశా అసలు రైతులు పక్కకు వచ్చినా, ఆయా పార్టీలు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని మరీ  ఇలాంటి ఉద్యమాలు నడిపించి, బీజేపీ పై విమర్శలు చేస్తూ ప్రజలలో తప్పుడు ఉద్దేశ్యాలు కల్పించే కుట్రలు కూడా చేయవచ్చు. దానిని ఉగ్రభూతాలు అనుకూలంగా నేర్చుకునే అవకాశాలు బాగా ఉన్నాయని నిఘా వ్యవస్థ హెచ్చరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: