దళితుల ఉద్దరణ.. కొన్నాళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ జపిస్తున్న మంత్రం ఇది. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఆదుకోవాలని కేసీఆర్ అంటున్నారు. అందుకే ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 4 నియోజక వర్గాల్లో ఈ దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించినా.. క్రమంగా రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకం వర్తింప జేస్తామని టీఆర్ఎస్ చెబుతోంది.


అయితే.. అలాంటి కేసీఆర్ మీద బీజేపీ విమర్శలు చేస్తోంది. కేసీఆర్ దళిత ద్రోహిగా మారిండని అంటోంది. దళిత బంధు అమలు నెపంతో ఎస్సీ సబ్ ప్లాన్.. కార్పోరేషన్ సబ్ ప్లాన్ ని కార్పోరేషన్ సబ్సిడీలను ప్రభుత్వం ఎత్తివేయాలని ప్లాన్ చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. ఇలా ఎస్సీలను మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బీజేపీ నేతలు కేసీఆర్ ను హెచ్చరిస్తున్నారు. తాజాగా సమావేశమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఐదు తీర్మానాలను ఆమోదించింది. అందులో దళిత బంధుపై తీర్మానం కూడా ఉంది.


రాజకీయం.. రైతుసమస్యలు.. దళిత బందు.. ధరణి.. నిరుద్యోగం అంశాలపై బీజేపీ తీర్మానాలు చేసింది. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణ ముఖ చిత్రం మార్చబోతున్నాయంటున్న బీజేపీ నేతలు.. ఫీజ్ రీయింబర్స్ మెంట్.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం.. తెరాస నాయకులకు నిత్యం ఆదాయంగా మారిందని.. మైనింగ్ తెరాస మాఫియా చేతుల్లోకి మారిందని.. గంజాయితో పాటు ఇతర మాద ద్రవ్యాల వ్యాపారం వెనక విదేశాంగ శక్తులు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.


అన్ని రకాల మాఫియాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలంటున్న బీజేపీ... ఒకే విడతలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సాహించాలని.. తక్షణమే వర్షానికి తడిసిన ధాన్యంను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. రైతుల ప్రత్యామ్నాయ పంటలకోసం సబ్సిడీ పై విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందించాలని డిమాండ్ చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: