నిన్న డెల్టా.. నేడు ఒమ్రికాన్.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేరియంట్లు ఇవే. కరోనా వంటి  వైరస్ అనేక మ్యూటెంట్లు చెంది కొత్త వేరియంట్లు పుట్టుకు రావడం సహజమే. అయితే.. ఈ వేరియంట్లు అన్నీ అంత ప్రమాదకరమైనవి కాదు.. ఇంకో మాటలో చెప్పాలంటే.. చాలా వేరియంట్లు అసలు కంటే చాలా తక్కువ ప్రమాదకరమైనవి. అయితే కొన్ని వేరియంట్లు మాత్రం మొండిఘటాలు.. అలాంటి వాటిలో డెల్టా, ఒమ్రికాన్ వంటివి ఉన్నాయి.


ఒమ్రికాన్ అనేది దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వేరియంట్‌. ఇది చాలా వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. అంతే కాదు..చాలా పవర్ ఫుల్ అన్న వాదనలు ఉన్నాయి. అందుకే ఈ వేరియంట్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. అందుకే అనేక దేశాలు దక్షిణాఫ్రికా నుంచి విమాన రాకపోకలను నిషేధించాయి. అయితే.. ఒమ్రికాన్ గురించి ఇప్పుడు ప్రపంచ మంతా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఈ వేరియంట్ ఇప్పటికే దక్షిణాఫ్రికాతోపాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌  దేశాలకు పాకేసిందట. తాజాగా జర్మనీలోనూ ఈ ఒమ్రికాన్ వేరియంట్ వెలుగు చూసింది.


మరో దేశం చెక్‌ రిపబ్లిక్‌లోనూ ఒమ్రికాన్ అనుమానిత  కేసు నమోదైంది. ఎక్కువ మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ వేరియంట్ కనిపిస్తున్న దక్షిణ ఆఫ్రికాకు చెందిన 8దేశాలపై ప్రపంచ దేశాలు క్రమంగా ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి.


కొత్త వేరియంట్‌ ఒమ్రికాన్ బయటపడగానే దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్స్‌ నిషేధం అమలు చేసింది. అప్పటికే బయల్దేరిన విమానాలను మాత్రమే అనుమతించింది. అంతే కాదు.. ఆ విమానంలో కూడా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలతోపాటు క్వారంటైన్‌ తప్పనిసరి అన్నమాట. అంతే కాదు..  దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం ఆమ్‌స్టర్‌డామ్‌ చేరుకున్న 2విమానాల్లో వచ్చినవారికి పరీక్షలు నిర్వహిస్తే 61మంది వరకూ పాజిటివ్‌ అని తేలిందట. అందుకే నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ప్రత్యేకించి ఆగ్నేయ ఆసియా దేశాలు మరింత అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: