టీడీపీ అధినేత చంద్ర‌బాబు కొత్త వ్యూహం సిద్ధం చేసుకున్నారు. పార్టీలో ఎంత చేసినా.. మైలేజీ క‌నిపించ డం లేద‌ని.. ఒక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీలో మ‌రోసారి బూస్ట్ నింపేందుకు స‌రికొత్త ఆలోచ‌న చేశారు. అసెంబ్లీలో త‌న‌కు జ‌రిగిన అవ‌మానం.. త‌న స‌తీమ‌ణికి జ‌రిగిన అవ‌మానాల‌ను.. నేరుగా ప‌ల్లెప‌ల్లెకు, గ‌డ‌ప గ‌డ‌ప‌కు తీసుకువెళ్లాల‌ని.. నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ``గౌర‌వ స‌భ‌``ల‌కు శ్రీకారం చుట్టారు. ప్ర‌తి ప‌ల్లెలోనూ.. ప‌ట్టణంలోనూ.. గౌర‌వ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. డిసెం బ‌రు 1 నుంచి ఈ కార్య‌క్ర‌మాలు సాగుతాయ‌ని.. ప్ర‌క‌టించారు.

అయితే.. వ్యూహం ఏదైనా.. అంతిమ ల‌క్ష్యం పార్టీని బ‌తికించుకోవ‌డం మాత్ర‌మేకాదు.. అధికారంలోకి తీసుకురావ‌డం. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు  అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా ఆయ‌న ప్ర‌తి కార్య‌క్ర‌మం కూడా ఇదే వ్యూహంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మైలేజీ రాలేదు. పైగా ఎక్కడ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఫ‌లితం శూన్యంగానే ఉంది.

దీంతో ఇప్పుడు త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని రంగ‌రించి.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా గౌర‌వ స‌భ‌లు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌.. వంటి నినాదాల‌తో ఆయ‌న ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిగా మ‌హిళ‌తోనే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ, చాలా చోట్ల త‌గినంత మంది మ‌హిళా కార్య‌క‌ర్త‌లు లేక పోవ‌డంతో. అంద‌రి భాగ‌స్వామ్యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని తీసుకువెళ్లాల‌ని అనుకున్నారు.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మాల్లో ఏం చెబుతారు? అంటే.. స‌భ‌లో చంద్ర‌బాబు భార్య‌ను ఎలా అవ‌మానించారో.. వివ‌రిస్తార‌ట‌. ఎందుకు అవ‌మానించారో.. వివ‌రిస్తార‌ట‌. దీంతో చంద్ర‌బాబు శ‌ప‌థం చేసి.. బ‌య‌ట‌కు వ‌చ్చిన తీరును క‌ళ్ల‌కుక‌డ‌తార‌ట‌. దీనివ‌ల్ల సింప‌తీ పెరిగి.. పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని.. బాబు భావిస్తున్నార‌ట‌. ఇదీ.. ఇప్పుడు సీనియ‌ర్ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి.. ఈ సింప‌తీ వ‌ల్ల‌.. మేలు జ‌రుగుతుందా?;  కీడు జ‌రుగుతుందా? అనేది చంద్ర‌బాబు ఆలోచించుకుంటే మంచిద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: