ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలు పరామర్శ యాత్రలు చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు, జనసేన తరపున నాదెండ్ల మనోహర్ పరామర్శల యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు. అదే సమయంలో బీజేపీ నేతలు వరద సాయం కోసం యాత్రలు చేపట్టారు. అయితే తమిళనాడులో ఇలా ప్రతిపక్షాలు ఎక్కువగా ప్రజల్లోకి వచ్చిన ఉదాహరణలు తక్కువ.

తమిళనాడులో ఇటీవల ఏపీకంటే భారీ వర్షాలు కురిశాయి. చెన్నై వాసులు వరదలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వరుణుడు ఇంకా తమిళనాడుపై జాలి చూపలేదు. మరోసారి విరుచుకుపడ్డాడు. తాజాగా చెన్నై మరోసారి వరద విలయంలో చిక్కుకుంది. సీఎం స్టాలిన్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వేలాదిమందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. తానే నేరుగా రంగంలోకి దిగి పునరావాస శిబిరాలను సందర్శిస్తూ అందరికీ సాంత్వన చేకూరుస్తున్నారు. ప్రతిపక్షాలకు అసలు ఛాన్సే లేకుండా చేస్తున్నారు.

ఏపీలో ఇలా.. తమిళనాడులో అలా..
ఏపీలో మాత్రం వరద రాజకీయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అక్కడ ప్రభుత్వ అధినేతే నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా చేశారు. పోనీ ప్రతిపక్ష నేతలు వరద సహాయక చర్యలకు వెళ్లినా, లేదా పరామర్శలకు వెళ్లినా కూడా వారికి చేదు అనుభవం ఎదురవడం ఖాయం. ఎందుకంటే.. అక్కడ నిన్న మొన్నటి వరకూ ప్రతిపక్ష డీఎంకే ప్రభుత్వంలో ఉంది. వారి నిర్వాకం వల్లే చెన్నైలో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ప్రచారాన్ని స్టాలిన్ బాగా జనంలోకి తీసుకెళ్లారు. దీంతో ప్రతిపక్షాలు బయటకొచ్చే సాహసం కూడా చేయడంలేదు. ఏపీలో మాత్రం సీఎం గాల్లోనే వచ్చారు, నేలపై దిగలేదని ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం దొరికింది. వరద రాజకీయం ఏపీలో ఇలా.. తమిళనాడులో అలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: