సువిశాల భారత దేశంలో తాజాగా వైద్యరంగ విషయంలో ఆందోళన పెరుగుతోంది. కోవిడ్ -19  మొదటి సారి దేశం పై ప్రభావం చూపిన తరువాత ఇకడి మానవాళికి వైద్య రంగం పై కోంత అవగాహన ఏర్పడింది.  కోవిడ్ -19 రెండో దఫా భారత్ పై ప్రళయ గర్జన చేసిన నేపథ్యంలో చాలా మంది మృత్యవాత పడ్డారు. ఆ గాయం తాలూకు మచ్చలు ఇంకా మదిలో నుంచి చెరగి పోలేదు. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్  భారత్ లో ప్రవేశించింది. దీంతో  భారతీయులలో ఆందోళన పెరిగింది.
యారప్ కేంద్రంలో మహమ్మారి బలంగా ఉండటంతో పాటు, అమెరికా వంటి దేశాలలో కూడా కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం, భారతీయ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం  చేపట్టిన టీకాల కార్యక్రమం ఇంకా భారత్ లో పూర్తిస్తాయిలో పూర్తి కాలేదు.
భారత్ లో రెండేళ్ల నుంచి పద్దేనిమిదేళ్ల లోపు టీకాలు వేయని పిల్లలు దాదాపుగా 44 కోట్ల మంది ఉంటారని అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. దీంతో వీరి పై కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయమై దేశంలో ఆందోళనలు నెలకొన్నాయి.  ఇంత మంది పిల్లలకు టీకా ఎప్పుడు ఎలా వేస్తారనే విషయంలో తల్లితండ్రులు  ఆందోళన  చెందుతున్నారు. వీరితో పాటు టీకాలు తీసుకున్న వారు కూడా భయాందోళనలో ఉన్నారు. కోవిడ్-19  వచ్చిన తరుువాత టీకా అనే పదానికి అర్థం మారిపోయింది. ఇది భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ కు కొత్త అర్ధాలు వచ్చాయి. గతంలో టీకా వ్యాక్సిన్ ఒక సారి వేసుకుంటే ఆ వ్యాధి మరో సారి వ్యాపించదని,  ఒకరి నుంచి మరోకరికి సంక్రమించదని అర్థం ఉండేది. కానీ ప్రస్తుతం  ప్రపంచ వ్యాప్తంగా  టీకా స్వరూప స్వభావాలు రోజు రోజుకూ మారుతున్నాయి. ఫలితంగా టీకా వేసుకున్న వారు కూడా ఎప్పడు ఎలా కరోనా కబళిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ భయాలు ఇప్పుడిప్పుడే తొలగేటట్లు లేవు.
ఓమిక్రాన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. ఇప్పటి వరకూ వయోజనులకు మాత్రమే పూర్తి స్థాయిలో టీకాలు వేసే కార్యక్రమం పూర్తయింది.  మధ్య వయస్కులలో ఇంకా చాలా మంది టీకాలు వేయించుకోవాల్సి ఉందని అధికార వర్గాల సమాచారం.
ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్   రెండు మూడు రోజుల్లా సమావేశం కానుంది. దీంతో అందరి చూపు ఈ సమావేశం పై పడింది. కోవిడ్-19 ను మరింత సమర్థ వంతంగా ఎదుర్కోవడానికి పిల్లలకు టీకాలు వేయమని సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
యుకె లాంటి దేశాలతో భారత్ ను పోల్చకూడదు.ఎందుకంటే అవి చాలా చిన్న దేశాలు. ఆ దేశాలలో టీకాలు వేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయింది.  12 ఏళ్లు వయసు పైబడిన వారందరికీ అక్కడ టీకాలు వేసేశారు. బూస్టర్ డోసుల కార్యక్రమం కూడా అక్కడ దాదాపుగా పూర్తి కావచ్చింది అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియుా సంస్థకు చెందిన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి పేర్కోన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: