నిన్న‌టి వేళ అఖండ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అనేక మంచి విష‌యాల‌కు వేదిక అయింది. చాలా రోజుల‌కు బాల‌య్య, అల్లు అర్జున్ ఒకే వేదిక‌పై క‌న‌ప‌డ‌డంలో ఉన్న ప్ర‌త్యేక‌త క‌న్నా ఒకే విధంగా మాట్లాడ‌డంలో ఉన్న ప్ర‌త్యేక‌త చాలా ప‌రిశీలించ‌ద‌గ్గ‌ది. ఆహ్వానించ‌ద‌గ్గ ది. అభినందించ‌ద‌గ్గ‌ది. ఎందుకంటే ఇవాళ సినిమా ప‌రిశ్ర‌మ  ఎన్నో ఆటుపోట్లు చ‌వి చూస్తోంది. నేరుగా ప్ర‌భుత్వాల‌తో ఢీ కొనే శ‌క్తి లేక, వేర్వేరు తోవ‌ల్లో ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో మాట్లాడినా కూడా ఫ‌లితం లేక చాలా అవ‌స్థ‌ల్లో ఉంది. కోవిడ్ కార‌ణంగా థియేట‌ర్ల మూత త‌రువాత మ‌ళ్లీ ఆంక్ష‌ల న‌డుమ తెరుచుకోవ‌డం ఇలా ఒక్క‌టేంటి అన్నీ ఇవాళ స‌వాళ్లే! ఒక పెద్ద సినిమాను ఎంచుకున్న నిర్మాత‌కు కొంప కొల్లేరే! మా అఖండ సినిమానే 21 నెల‌ల పాటు షూట్ చేసేందుకు కంప్లీట్ చేసేందుకు పట్టింది.. ఇందులో 15 నెల‌లు కోవిడ్ తినేసింది.


ఇంకా మిగిలిన ఆరు నెల‌ల్లోనే నేను ఈ సినిమాను పూర్తి చేసేందుకు ఫ‌స్ట్ కాపీ రెడీ చేసేందుకు వాడుకున్నాను అని నిన్న‌టి వేళ బోయ‌పాటి శ్రీ‌ను స‌భలో చెప్పారు. అంటే పెద్ద సినిమాలేవీ అంత తొంద‌ర‌గా అనుకున్నంత వేగంగా పూర్తి కావ‌డం లేద‌నే తేలిపోయింది. ఇదే విధంగా చిరంజీవి ఆచార్య కూడా చాలా ఎక్కువ స‌మ‌యమే తీసుకుంది. షూటింగ్ కార‌ణంగా ఏమ‌యినా ఇబ్బందులు త‌లెత్తితే గ‌తంలో మాదిరి కాకుండా నెల‌ల త‌ర‌బ‌డి ఆ ప్రాసెస్ మొత్తం ఆగిపోతోంది. దీంతో స్టోరీ కంటిన్యూటీ, సీన్ కంటిన్యూటీ, కాస్ట్యూమ్ కంటిన్యూటీ ఇలా అన్నీ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ  నిర్మాత‌లూ, ద‌ర్శ‌కులూ ఇదే రంగాన్ని న‌మ్ముకుని ఉన్న న‌టీన‌టులు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచేస్తున్నారు. ఈ ప‌రిశ్ర‌మ‌ను న‌మ్ముకుని వేల కుటుంబాలు ఉన్నాయి క‌నుక వాళ్లంద‌రికీ అన్నం దొర‌కాలంటే అంతా క‌లిసి  ప‌నిచేయాల్సిందే! ఇప్పుడీ వాతావ‌ర‌ణం పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని  సినిమాల‌కూ వ‌ర్తిస్తుంది.ఒక‌ప్ప‌టిలా పెద్ద సినిమాలు సేఫ్ జోన్ లో లేవు. 


ఆ మాట‌కు వ‌స్తే నిన్న బ‌న్నీ చెప్పిన విధంగా చిన్న సినిమాలే హాయిగా న‌డుస్తున్నాయి. అంటే కోవిడ్ కార‌ణంగా కొంత, తాజా నియమ నిబంధ‌న‌లు కొంత పెద్ద సినిమాల‌కు ప్రాణ సంక‌టంగా మారాయి. ఈ త‌రుణంలో అన్ని సినిమాలూ బాగుండాలి అంద‌రు హీరోలూ బాగుండాలి అన్న నినాదం ఒక‌టి ప్ర‌త్యేకంగా వినిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పెద్ద సినిమా అంటే గాల్లో దీపం అన్న మాదిరిగానే ఉంది. ఎంత నిర్మాత‌ల‌కు అనుగుణంగా హీరోలు మారి త‌మ రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించుకున్నా కూడా  ఆ విధంగా ప‌రిస్ధితులు అయితే లేవు. అందుకే పెద్ద హీరోల సినిమాల‌న్నీ డైల‌మాలోనే ఉన్నాయి. ఒక‌రినొక‌రు ప్రోత్స‌హించుకోకుండా ఇగోల‌కు పోతే ఇక అంతే సంగ‌తులు. అందుకే నిన్న‌టి స్పీచ్ లో బోయ‌పాటి కూడా నేను బాగుండాలి కాదు సినిమా బాగుండాలి అన్న మాట ఒక‌టి ప‌దే ప‌దే చెప్పారు. ఆ విధంగా సినిమా బాగుండేందుకు సినిమా ప‌రిశ్ర‌మ బాగు ప‌డేందుకు ఉన్న అవ‌కాశాల‌న్నింటినీ ద‌ర్శ‌క, నిర్మాతలు వాడుకోవాలి. ముఖ్యంగా ఫిల్మ్ ప్ర‌మోష‌న్ కు సంబంధించి ఇప్పుడు పాటిస్తున్న టెక్నిక్స్ బాగున్నాయి. వీటిని కొన‌సాగిస్తే చాలు.. ఆ హీరోహీరో అన్న తేడా లేకుండా అంద‌రి హీరోల సినిమాల‌నూ
అంద‌రి అభిమానులూ త‌ప్ప‌క ఆద‌రిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: