తెలంగాణ రాజ‌కీయం మొత్తం వ‌రి ధాన్యం చుట్టూనే తిరుగుతోంది. ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. వ‌రి సాగు చేయొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఎక్క‌డా చెప్ప‌లేద‌ని.. కేంద్రం, రాష్ట్రానికి మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ధాన్యం కొంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కేంద్రం బియ్యం కొన‌దు, వ‌రి వేయొద్ద‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వానకాలం దాన్యం కొనుగోలు చేయకుండా వచ్చే కాలం పంట గురించి చెప్ప‌డం ఏంట‌ని అన్నారు. దీని ద్వారా సీఎం కేసీఆర్ హుజురాబాద్ లో బీజేపీ గెలుపు నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.


 రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత వేగవంతమైన మార్పులు వస్తున్నాయని.. టిఆర్ఎస్ పాలన సాగిన ఏడున్న‌రేళ్ల‌లో  ఉద్యమకారులు కూడా సంతోషంగా లేరని.. తెలంగాణ కవులు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, ఉద్యమకారులు ఒక్కొక్కరుగా టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని, కెసిఆర్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై కత్తులు నూరుతున్నారు అని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలు సాధారణమైనవి కావని టీఆర్ఎస్ గెలుపు కోసం కెసిఆర్ స్వయంగా రెండు నెలలు పూర్తిగా కేటాయించేలా చేసిన ఎన్నికల ని చెప్పుకొచ్చారు.   అయిన వారిని ప్రజలు న‌మ్మ‌లేద‌ని తెలిపారు. ఆ ఒక్క ఎన్నిక‌ కోసమే దళిత బంధు తెచ్చారని అయినా వారికి ఓటమే మిగిలింది అన్నారు. హుజురాబాద్ లో ఎంత మందికి దళిత బందు ఇచ్చారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ అంద‌రికీ ఇస్తానంటే తామే వాలంటర్లుగా పని చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ సేకరణకు కేంద్రం 2014లో రూపాయలు 3,600 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది 26 వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేసిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: