బెంగాల్ బెబ్బులి కేంద్రంలో చక్రం తిప్పనున్నారా..? అదే లక్ష్యంగా మరిన్ని రాష్ట్రాల్లో పాగాకు పావులు కదుపుతున్నారా..? టిఎంసి బెంగాల్ కు మాత్రమే పరిమితమైన ఈ పార్టీ. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా టీఎంసీ మారనుందా? మారుతున్న పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. 2021 అసెంబ్లీ వెస్ట్ బెంగాల్  ఎన్నికల్లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ సృష్టించిన ప్రభంజనం దేశ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్ ను తెరపైకి తెచ్చిందని అంచనాలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లో మారిన, మారుతున్న నేపథ్యాలు కూడా దీనికి తోడవుతున్నాయి. బెంగాల్ లో అధికారంపై మమతా బెనర్జీని బిజెపి సవాల్ చేసింది. దాదాపు రెండేళ్లు బిజెపి బెంగాల్ లో ఒక రేంజ్ లో హంగామా చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల వరకు అటు బిజెపి ఇటు టిఎంసి పోరు కొదమ సింహం లా కనిపించింది. అయితే అసెంబ్లీ ఫలితాల్లో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఈ పరిణామాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను టీఎంసీ కి అప్పజెప్పనుందన్న అనుచిత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాల కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు దీదీ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని టీఎంసీలో చేరినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో తాము బాధ్యత సరిగా నిర్వర్తించలేకపోతున్నామని దీదీ నేతృత్వంలోముందుకు సాగాలనుకుంటున్నామని చెప్పారు. ఎవరూ ఊహించని రాజకీయ ఎత్తుగడ తో దీదీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మరో వైపు మోడీ, షా ధ్వయాన్ని ఎలా ఓడించవచ్చో టిఎంసి రుజువు చేసింది. అందుకే ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. వేరే పార్టీలకు చెందిన ఎంతో మంది నాయకులు టీఎంసీ లో చేరేందుకు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. మమతా బెనర్జీ నే బిజెపికి ప్రత్యామ్నాయమని వారంతా భావిస్తున్నారు.అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించి 2024 లో అధిక ఎంపీ సీట్లతో కేంద్రంలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతోనే మమత ఇతర రాష్ట్రాల దిశగా అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: