ఏపీలో రాజకీయం రంజుగా మారుతుంది. అధికార వైసీపీ వ‌ర్సెస్ విప‌క్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోయి వైసీపీ వాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ... వైసీపీ నాయకుల పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ లో ఉన్న రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో కూడా జగన్ చేసిన తప్పులే అక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం గా కనిపిస్తున్నాయి. ఇక్క‌డ నుంచి గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ ప్రభుత్వ అధికారి బొంతు రాజేశ్వరరావు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో కూడా ఆయన కేవలం ఏడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేన గెలిచిన ఏకైక సీటుగా రాజోలు రికార్డులకు ఎక్కింది. ప్రజల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా రికార్డులు క్రియేట్ చేసిన రాపాక వరప్రసాదరావు ... ఆ తర్వాత వైసిపి చెంత చేరి పోయారు. అయితే ఇప్పుడు జగన్ పార్టీ కోసం కష్టపడిన వారిని కాద‌ని.. పార్టీ మారి వ‌చ్చిన‌ రాపాక వరప్రసాదరావు కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో రాజోలు వైసీపీ సీటు రాపాక దే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వైసిపి వర్గాలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన నేతలను కాదని రాపాక జనసేన కేడర్ కు పనులు చేస్తున్నారని.. వారికే ప్రయార్టీ ఇస్తున్నారంటూ వైసీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో రాపాక పేరు చెబితేనే వైసిపి వాళ్ళు భగ్గుమంటున్నారు. మరి జగన్ ఆ తప్పు చేస్తారా ? లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: