- త్వ‌ర‌లో మాజీ మంత్రి,
వైఎస్ భ‌క్తుడు కోండ్రు ముర‌ళి జంప్

- మారుతున్న స‌మీక‌ర‌ణ‌లు

- ఎవ‌రు ఎటువైపో తేల‌క తిక‌మ‌క

- క‌ళాకు మైన‌స్ అచ్చెన్న‌కు ప్ల‌స్

- మారుతున్న రాజాం రాజ‌కీయం

మా శ్రీ‌కాకుళం జిల్లాలో కులాల కుంప‌ట్లు ర‌గులుతున్నాయి. ఎచ్చెర్ల, రాజాం, పాల‌కొండ రాజ‌కీయాల‌ను శాసించే  మాజీ మంత్రి క‌ళా వెంక్ర‌టావుకు మ‌రొక క‌ష్టం వ‌చ్చిప‌డ‌నుంది. అవును ! క‌ళా కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్న వ‌ర్గం అంతా ఇప్పుడు వైసీపీకి చేరిపోనుంది. ఆ విధంగా క‌ళాను ఎప్ప‌టి నుంచో వ్య‌తిరేకిస్తున్న అచ్చెన్నకు ఈ ప‌రిణామం ఓ ప్ల‌స్..అదే విధంగా క‌ళాకు మైన‌స్. వాస్త‌వానికి ఎప్ప‌టినుంచో ఎచ్చెర్ల  నియోజ‌క‌వ‌ర్గం పై ప‌ట్టు పెంచుకునేందుకు అచ్చెన్న వ‌ర్గం ప్ర‌య‌త్నిస్తోంది. ఎర్ర‌న్న భ‌క్తుడు అయిన ర‌ణ స్థ‌లం నేత క‌లిశెట్టి అప్ప‌ల నాయుడు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నారు.


ఇదే స‌మ‌యంలో మ‌రో భ‌క్తుడు చౌద‌రి బాజ్జీ ( మాజీ జెడ్పీ చైర్మ‌న్ చౌద‌రి ధ‌న‌ల‌క్ష్మి భ‌ర్త ) కూడా బ‌ల‌మైన నాయ‌కుడిగా స‌త్తా చాటేందుకు, ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఎదిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలా అటు రాజాంలో కానీ ఇటు ఎచ్చెర్ల‌లో కానీ ఎర్ర‌న్న మ‌నుషులున్నారు. వారు ఎదిగేందుకు స‌రైన స‌మ‌యం కోసం చూస్తున్నారు. ఒక‌వేళ మాజీ మంత్రి, ధ‌ర్మాన అనుచ‌రుడు ఓ విధంగా స్నేహితుడు అయిన కోండ్రు ముర‌ళీ క‌నుక వైసీపీ కి చేరిపోతే రాజాంలో టీడీపీ ఆశ‌లు గ‌ల్లంతే! ఇదే స‌మ‌యంలో పాల‌కొండ లో కూడా కొన్ని మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. కాస్త దృష్టి సారిస్తే టీడీపీ పాల‌కొండ‌లో కూడా ప‌ట్టు పెంచుకోవ‌చ్చు. కాపు సామాజిక వ‌ర్గ నేత‌ల‌ను ఆక‌ర్షించే ప‌ని చంద్ర‌బాబు చేస్తే త‌ప్ప‌క పాల‌కొండ కూడా త‌న ఖాతాలోనే వేసుకోవ‌డం ఖాయం టీడీపీకి.

ఆ విధంగా ఒకేసారి మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి అచ్చెన్న మ‌నుషులు ప‌ట్టు సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది. పాలకొండ పేరు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం అయినా కాపుల‌దే ప్రాబ‌ల్యం. అలానే రాజాం పేరుకు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయినా అక్క‌డ కూడా ప్రాబ‌ల్యం కాపుల‌దే! ఇక ఎచ్చెర్ల లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గొర్లె కిర‌ణ్ పై పోటీ చేసేందుకు టీడీపీ మంచి అభ్య‌ర్థిని వెతుక్కుంటే క‌ళాను కాద‌ని వెతుక్కుంటే మంచి ఫ‌లితాలు రావ‌డం ఖాయం. ఎందుకంటే క‌ళా సీనియ‌ర్ నాయ‌కుడిగానే పేరుంద‌ని సిన్సియ‌ర్ నాయ‌కుడిగా పేరు లేద‌ని కొత్త వారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంద‌ని ఎర్ర‌న్న వ‌ర్గం అంటోంది. అలానే రాజాంకు సంబంధించి గ్రీష్మ‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారు ఎర్ర‌న్నాయుడి వ‌ర్గంకు చెందిన నాయ‌కులు. ఈమె మాజీ స్పీక‌ర్ కావ‌లి ప్ర‌తిభాభార‌తి కుమార్తె. గ‌త ఎన్నిక‌ల్లో సీబీఎన్ ఆర్మీ జిల్లా అధ్య‌క్షురాలిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఆమె క‌నుక అభ్య‌ర్థిగా నిలిస్తే రాజాంలో కోండ్రు ముర‌ళి గెలుపు సులువు అవుతుంది. కోండ్రు క‌నుక ధ‌ర్మాన సాయంతోనో మ‌రొక‌రి సాయంతోనో వైసీపీకి చేరితే ఇవ‌న్నీ సాధ్యం. ఇప్ప‌టికే ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న కంబాల జోగులు క‌ళా శిష్యుడిగా పేరున్న నేత. ఆయ‌న రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేం లేదు అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోండ్రుకు ఛాన్స్ ద‌క్కితే జోగులును త‌ప్పిస్తే వైసీపీకి మంచి ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశాలే మెండు.

మరింత సమాచారం తెలుసుకోండి: