టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా లో గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అస‌లు పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేన‌ట్టుగా కేవ‌లం ఒకే ఒక సీటుతో స‌రిపెట్టుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో కుప్పంలో చంద్ర‌బాబు మిన‌హా జిల్లాలో ఎవ్వ‌రూ విజ‌యం సాధించ‌లేదు. చంద్ర‌బాబు కూడా పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత గా 30 వేల మెజార్టీతో మాత్ర‌మే గెలిచారు. చంద్ర‌బాబు కు ఎప్పుడూ కుప్పంలో 45 - 50 వేల ఓట్ల మెజార్టీ వ‌స్తుంది.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కొన్ని రౌండ్ల‌లో వెన‌క ప‌డిపోయారు. చివ‌ర‌కు ఎలాగోలా 30 వేల తో గ‌ట్టెక్కారు. ఇక పార్టీ ఓడిపోయిన 1989 - 2004 - 2009 ఎన్నిక‌ల్లో కూడా జిల్లాలో టీడీపీకి చిత్తూరు ఎంపీ సీటుతో పాటు గౌర‌వ ప్ర‌ద‌మైన సీట్లు వ‌చ్చాయి. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మ‌రీ ఘోరంగా ఒక్క సీటుతో మాత్ర‌మే స‌రి పెట్టుకుంది. ఇక 2014 ఎన్నిక‌ల్లో చిత్తూరు అసెంబ్లీ సీటును టీడీపీ నిల‌బెట్టుకుంది.

చిత్తూరు జిల్లా  లో బ‌లిజ + క‌మ్మ ఓటు బ్యాంకు ఎక్కువ‌. 2014 ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవ‌డం తోనే చిత్తూరు ఎమ్మెల్యే సీటుతో పాటు మెజార్టీ సీట్ల‌లో విజ‌యం సాధించింది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ లు రెండు విడి విడిగా పోటీ చేశాయి. దీంతో టీడీపీ చిత్తు గా ఓడిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మరోసారి జ‌న‌సేన - టీడీపీ క‌లిసి పోటీ చేస్తాయ‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో చిత్తూరు సీటు ను ఖ‌చ్చితంగా గెలుస్తామ‌న్న ధీమా టీడీపీ లో ఉంది.

అందుకే ఈ సీటు నుంచి పోటీ చేయాల‌ని చాలా మంది పార్టీ నేత‌లు రేసులో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డీకే స‌త్య‌ప్ర‌భ మృతి చెంద‌డంతో చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే ప్ర‌స్తుతం చంద్రగిరి ఇన్ ఛార్జిగా ఉన్న పులవర్తి నాని కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నార‌ట‌. మ‌రి చంద్ర‌బాబు డెసిష‌న్ ఎలా ఉంటుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: