త్వ‌ర‌లోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం మీరు గ‌ట్టిగా పోరాటం చేయాలి అని ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌మ పార్టీల‌కు చెందిన ఎంపీల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టుల విష‌యం లో పోరాటం చేయాల‌ని చెప్పారు. అస‌లు ఎప్పుడు పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రిగినా కూడా ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేయాల‌ని పార్టీ నేత‌లు చెప్ప‌డం.. కేంద్రం ప‌ట్టించు కోక‌పోవ‌డం కామ‌న్ అయిపోయింది.

అయితే మ‌న రాష్ట్రానికి చెందిన ఎంపీ లు మాత్రం స‌మ‌ష్టిగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏనాడు ఫైట్ చేయ‌లేదు. వీరు త‌మ‌లో తాము క‌ల‌హించు కుంటూ పార్ల‌మెంటులో ఏపీ ప‌రువు తీసేస్తున్నారు. వీరు నిజంగా రాష్ట్ర స‌మ‌స్య ల‌పై ఏనాడు పోరాటం చేయ‌రు. వైసీపీ వాళ్లు ఎప్పుడు మాట్లాడినా చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రాన్ని నాశ‌నం చేసేశార‌ని అంటారు.

ఇక టీడీపీ వాళ్లు మాట్లాడితే వైసీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ చ‌ర్య‌ల వ‌ల్లే రాష్ట్రం ఇలా అయిపోతుంద‌ని చెపుతూ ఉంటారు. ఇలా పార్ల‌మెంటు సాక్షి గా వీళ్ల ల్లో వీళ్లే క‌ల‌హించు కుంటూ ఉండ‌డంతో రాష్ట్రం నాశ‌నం అవుతోంది. వీరు పార్ల‌మెంటు లోనే ఇలా క‌ల‌హించు కోవ‌డంతో దేశ స్థాయిలో మిగిలిన రాష్ట్రాల ఎంపీల ముందు మన రాష్ట్ర ఎంపీలు ఎంత చుల‌క న అయిపోతున్నారో ఆ విష‌యం వీరికి అర్థం కావ‌డం లేదు.

ఈ క్రమంలోనే మోడీని...  కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ద‌మ్ము మ‌న ఎంపీల‌కు ఎంత మాత్రం లేద‌నే చెప్పాలి. ఇక ఏపీ ప్ర‌జ‌లు వీరిపై పెట్టుకున్న చిల్లి గ‌వ్వంత ఆశ‌లు కూడా ఏ మాత్రం నెర‌వేరే ప‌రిస్థితి లేద‌నే అనాలి. మ‌రి మ‌న ఎంపీ లు ఇప్ప‌ట‌కి అయినా త‌మ తీరు మార్చుకుని.. రాష్ట్ర ప్ర‌యోజ నాల కోసం స‌మ‌ష్టి గా పోరాటం చేస్తారేమో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: