కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు  ఏ వేరియంట్ వచ్చినా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉన్నాం అని ఉప ముఖ్య‌మంత్రి ఆళ్ళ‌నాని అన్నారు. సోమ‌వారం గుంటూరు మెడికల్ కాలేజ్ ప్లాటినం జూబిలి ఉత్సవాల్లో హోంమంత్రి సుచరిత, ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని పాల్గొని  పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి ఆళ్ళనాని మాట్లాడారు.  గుంటూరు మెడిక‌ల్ పురాత‌న‌మైన కాలేజ్ అని చెప్పారు.  మధురైకి వెళ్ళాల్సిన మెడిక‌ల్ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేశారు అని గుర్తు చేశారు. ఈ కాలేజీలో ఎంతోమంది ఇక్కడ చదువుకొని ప్రముఖ వైదులయ్యారని తెలిపారు.
 

అలాగే.. ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. 500 కోట్ల రూపాయ‌లతో గుంటూర్ మెడిక‌ల్ కాలేజ్ ను, ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు ఉప ముఖ్య‌మంత్రి ఆళ్ళ నాని. ఈ ఆస్ప‌త్రిలో ఎన్నో స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెడుతున్నాం అని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కట్టడి కోసం మధ్యాహ్నం సిఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సమీక్షా సమావేశం ఉండ‌నుంది అని చెప్పారు. భార‌త్‌లో ఒమిక్రాన్ వేరియంట్ విస్త‌రిస్తుంద‌ని కేంద్రం హెచ్చ‌రిక‌ల‌తో ఏపీ ప్ర‌భుత్వం స‌మీక్ష నిర్వ‌హించ‌నుంది.


సిఎం సూచనల మేరకు ఒమిక్రాన్ క‌ట్ట‌డికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం అని ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జిజిహెచ్ లో మాతా శిశు సంరక్షణ భవనం పనులు మొదలు పెట్టే విధంగా అధికారులతో మాట్లాడతాను హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ బిల్స్ గతంలో ఆరేడు నెలలు పెండింగ్ లో ఉండేవి అని కానీ.. ఇప్పుడు 21 రోజుల్లో బిల్స్ క్లియర్ చేయాలని సిఎం చెప్పారు అని పేర్కొన్నార‌ని. ఆయ‌న ఆదేశాల ప్ర‌కారం అదేవిధంగా బిల్స్ చెల్లిస్తాం అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: