ప్రపంచ పటంలో ఒక రాక్షస దేశం అంటూ ఏర్పాటు కావడంతో అసలు విషయాలు అన్ని బయటకు వస్తున్నాయి. ఒకనాడు ఉగ్రవాది అంటే ఎక్కడో దాక్కొని బ్రతుకుతూ, ఎప్పుడో దాడులు అది కూడా దొంగతనంగా చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కాస్త సాంప్రదాయానికి విరుద్ధంగా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు అయితే ప్రపంచ పటంలో తమకంటూ ఒక దేశం ఏర్పాటు అయ్యిందో అప్పటి నుండి ఈ స్థితిలో కాస్త మార్పులు వచ్చేశాయి. అంటే కొన్నిదశాబ్దాలు వాళ్ళుకూడా పాక్ లాంటి లేదా చైనా లాంటి దేశాలతో కలిసిమెలిసి ఉన్నందున కొత్తగా ఎలా మనుషులను విడగొట్టి తమ పంతాలు నెగ్గించుకోవచ్చు అనే కోణాన్ని బాగా  చేసుకున్నట్టే ఉన్నారు.

దీనితో మతతత్వ దేశాల ఏర్పాటుకు నియత్నించే వాళ్ళు తాజాగా తమ విధానాలను మార్చుకున్నారు. ఎప్పుడైతే దేశం ఏర్పాటు చేసుకోగలిగారో, అప్పటి నుండి పాక్ ను కూడా నిదానంగా స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఇతర దేశాలలో తమ సేనతో(స్లీపర్ సెల్స్) ఎక్కడికక్కడ తమ మతం వారి తీరులో కొద్దికొద్దిగా మార్పులు తెస్తున్నారు. అది ఆయా మతపెద్దలను భయపెట్టి చేస్తున్నారా మరొకటా అనేది దర్యాప్తు ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఆయా ప్రాంతాలలో ఉన్న తమ మతం వారిని మెల్లిగా ఇతర మతాల నుండి వేరు చేస్తూ వస్తున్నారు. వీలైనప్పుడల్లా గొడవలు రాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే అప్పటివరకు  అక్కడ మత సామరస్యం ఉన్నప్పటికీ, లేనిపోని కొత్త కొత్త విధానాలు సృష్టించి మరీ ఈ గొడవలకు తెరలేపుతున్నారు.

ఒక్కచోట అయితే అందరికి అనుమానం వస్తుంది, అందుకే మెల్లిగా అన్ని ప్రాంతాలలో ఈ విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన చిచ్చు అంశాలు ఈ తీవ్రవాద దేశం ఏర్పాటు చేసిన తరువాత బాగా ఎక్కువ చోచుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అనేక మతాలకు చెందిన వారు జీవించే ప్రాంతాలు వీళ్లకు ప్రధాన లక్ష్యాలు. కారణం అక్కడ తొందరగా మతపరమైన గొడవలు జరిగే అవకాశాలు ఎక్కవుగా ఉంటాయి కాబట్టి. అందులో భాగంగా భారత్ లో కూడా వారి లక్ష్యాలు చక్కగా నెరవేర్చుకుంటున్నారు. ఎప్పుడో మాసిపోయిన గాయాలను మరోసారి లేపి మరీ ఈ వివాదాలను జరిగేట్టుగా సందర్భాలను వాడుకుంటున్నారు. అందుకు సున్నితమైన విషయం మతం ఒక్కటే. తాజాగా గురుగావ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడే కాదు, దేశంలో చాలా చోట్ల పరిస్థితి అదే, అందుకే ప్రజలు వీటిని అర్ధం చేసుకొని సంయమనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు మానవేలుతో మన కంటినే పొడవాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: