దేశంలో సరికొత్త కేసులు వెలుగు చూస్తున్నట్టుగా ఉంది న్యాయస్థానం. ఇటీవల ఈ తరహా వింత కేసులు బాగా పెడుతున్నాయి కూడా. చితికి మాటికీ కేసులు వేయడం సహజంగా జారుతున్నదే కావచ్చు కానీ, అసలు ఎప్పటి నుండో వస్తున్న ఒక విధానాన్ని ఇప్పుడు ప్రశ్నించడం అనే ఆలోచన ఎక్కడ పుడుతోంది, ఎవరు చెబితే పుడుతుంది అనేది ఆలోచించాల్సి ఉంది. ఈ ఆలోచన న్యాయస్థానం చేస్తుందా లేక ఊరికే పిటిషన్ వేశారు కాబట్టి వాదనలు వింటుందా అనేది చూడాలి. ఒకదానిపై పిటిషన్ వేస్తె దానిలో లోటుపాట్లపై న్యాయవ్యవస్థ విచారణ చేస్తుందా లేక పిటిషన్ దారు చెప్పిన దానిని బట్టి ఆయా వ్యవస్థలను ప్రశ్నిస్తుందా అనేది తెలియదు కానీ. సొంత దర్యాప్తు వ్యవస్థ న్యాయవ్యవస్థకు ఉంటె ఇలాంటివి వచ్చినప్పుడు, ఆయా విషయాల వెనుక ఉన్న కారణాలు కనుగొని, అప్పుడు ఎటువంటి ప్రయోజనం ఆశించి సదరు పిటిషనర్ పిటిషన్ వేశాడు అనేది కనిపెట్టి, దానికి తగ్గట్టుగా న్యాయవ్యవస్థ స్పందించవచ్చు.

ఏమో ఎవరికి తెలుసు ఒక పిటిషనర్ తప్పుడు ఉద్దేశ్యంతో లోతైన కారణంతో పిటిషన్ వేసి ఉంటె, దానిని కనిపెట్టలేక న్యాయస్థానం విచారణ చేసి, తీర్పు వెలువరిస్తే జరిగే పరిణామాలు ఎవరు భరించాల్సి ఉంటుంది. ఈ కోణంలో న్యాయవ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం ఇప్పటివరకు రాలేదేమో కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగానే ఉన్నాయి. ఎవరో ఎదో చెప్పారని, తప్పుడు ఉద్దేశ్యంతో లేదా ఎవరో భయపెట్టడం ద్వారా తప్పుడు పిటిషన్ వేస్తే, దానిని న్యాయస్థానం స్వీకరిస్తే పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించాల్సి ఉంది. నిజమే ఎప్పటివో చెదలు పట్టిన నియమనిబంధనలు ఇప్పటికి పాటిస్తూ ఉన్నాయి కొన్ని వ్యవస్థలు. అందులో మార్పులు కోరుకుంటూ ఈ తరం కోర్టులను ఆశ్రయించడంతో తప్పులు వెతకకూడదు కాబోలు.

కానీ దేశీయంగా ఏర్పడిన పరిస్థితులను గమనిస్తే ఆయా పిటిషన్ ల వెనుక ఎవరైనా ఉన్నది లేనిది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా న్యాయం దారిమళ్ళకుండా ఉంటుంది. అలాగే ఆయా పిటిషన్ ల పై దర్యాప్తు వలన దేశీయంగా నష్టం ఉందా లేక మరో రకంగా ఏ వ్యవస్థకైనా నష్టం వాటిల్లనుందా అనే కోణాలు గమనించి, ఆయా వ్యవస్థలను హెచ్చరించవచ్చు. మతపరంగా దేశంలో జరుగుతున్న అనేక విషయాలు  ఇప్పుడు న్యాయస్థానం తలుపు తడుతున్నాయి. వాటి వెనుక మూల కారణం తెలుసుకొని అవన్నీ విచారణకు స్వీకరించడం చాలా మేలు. లేదంటే దేశంలో లేనిపోని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు బాగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: