ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతుంది బిగ్బాస్ కార్యక్రమం. గత కొన్ని సీజన్ల నుంచి కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం బిగ్బాస్ ఐదవ సీజన్ కూడా ప్రేక్షకులందరికీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది. ఇక బిగ్బాస్ ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. హౌస్ లో ఆట మరింత రసవత్తరంగా నే మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఎవరు టాప్ ఫైవ్ లో నిలవ బోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే బుల్లితెర ప్రేక్షకులందరికీ  ఆకర్షిస్తున్న బిగ్బాస్ కార్యక్రమంపై ఎంతో మంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.


 గతంలో సిపిఐ నేత నారాయణ బిగ్ బాస్ లాంటి షో ఏకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగానే ఉంది అంటూ ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ లాంటి షోలను ప్రభుత్వం వెంటనే బ్యాన్ చేస్తే బాగుంటుంది అంటూ డిమాండ్ చేశారు. బిగ్ బాస్ లాంటి షోలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాయ్ అని అంటూ ప్రశ్నించారు. అయితే ఇక ఇప్పుడు మరోసారి బిగ్బాస్ కార్యక్రమం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటోంది.. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమం పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.. బిగ్ బాస్ లో కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు.


 బిగ్ బాస్ కార్యక్రమంలో ఏం జరుగుతోందో అసలు అర్థం కావడం లేదు యాంకర్ రవి విషయంలో ఏం జరిగిందో బయటపెట్టాలి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరాడు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. చిన్నారులు మహిళలు బిగ్ బాస్ షో చూడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. బిగ్బాస్ కార్యక్రమానికి సెన్సార్ వుండాల్సిందే. ఇక ఈ షో ని బ్యాన్ చేయాలి అంటూ కేంద్రానికి లేఖ రాస్తాను అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఇటీవల హౌస్ నుంచి రవి ఎలిమినేట్ అవ్వటంతో అందరూ బిగ్బాస్ నిర్వాహకులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: