స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టార్గెట్ కి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీకి ఈటెల  రాజేందర్ షాక్ ఇవ్వాలని అనుకుంటూ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక దీనికి కాంగ్రెస్ సాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు గా కనిపిస్తోంది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ లోని రెండు స్థానాల్లో పోటీ జరుగుతోంది. అక్కడ ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ తరఫున స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నందున వారిని కాపాడుకునేందుకు ఎవరికైనా మద్దతు ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు.

 ఆదిలాబాద్ లో ఆదివాసి నేతగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి ని పుష్ప రాణికి అధికారికంగానే కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. కరీంనగర్లో తనకు మద్దతు ఇవ్వాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఆయనకు ఈటెల రాజేందర్ మద్దతు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈటెల వర్గీయులు,కాంగ్రెస్ కలిసి ఆయనను గెలిపించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే నల్గొండలో స్వతంత్రులకు మద్దతు ఇవ్వడం పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. బరిలో ఉన్న ఆరుగురు స్వతంత్రుల్లో ఇద్దరు కాంగ్రెస్ జెడ్పిటిసి లే ఉన్నారు. నిర్ణయాన్ని కోమటిరెడ్డి కి వదిలేశారు. ఎన్నికలు జరిగే నాటికి ప్రతిచోటా ఒక అభ్యర్థికి పార్టీ పక్షాన మద్దతు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాము పోటీ చేస్తున్న చోట అయినా లేదంటే ఇండిపెండెంట్లకు మద్దతు ఇస్తున్న చోట అయినా ఒకటి రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

నిజానికి అన్నిచోట్లా టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎక్కడైనా ఓడిపోతుంది అంటే జారిపోతున్న ఆ పార్టీ పట్టుకు నిదర్శనంగా మారుతుందని చెప్పచ్చు. దాన్ని నిరూపించుకునేందుకు ఈటెల ప్రయత్నాలు  చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ కూడా ఈటల తరహాలోనే ఆలోచిస్తూ ఆయన మద్దతు ఇచ్చిన వారిని బలపరిచే ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: