తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా చంద్రబాబు...ప్రతి నియోజకవర్గంపై ఫోకస్ చేసి పార్టీని వైసీపీకి ధీటుగా నిలబెట్టే నాయకులని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఏదైనా నియోజకవర్గాల్లో నాయకులు లేకపోతే..ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకులని ఇంచార్జ్‌లుగా పెడుతున్నారు. అలాగే పనిచేయని నాయకులని పక్కనబెట్టి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో బాబు..నాయకులని ఇంకా పూర్తి స్థాయిలో పెట్టలేదు. అసలు ఆ స్థానాల్లో పార్టీ తరుపున పోటీ చేసే నాయకులు ఎవరో క్లారిటీ లేదు. ఆ స్థానాల్లో నాయకులని ఎప్పుడు నియమిస్తారో కూడా తెలియడం లేదు. అయితే కొన్ని చోట్ల నాయకులని పెట్టకుండా కావాలనే ఆపినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ జనసేనతో గానీ పొత్తు ఉంటే...కొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆ సీట్లలో టీడీపీకి నాయకులు ఉంటే ఇబ్బంది అవుతుంది. సీటు త్యాగం చేసే టీడీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతుంది.

అందుకే చంద్రబాబు కొన్ని సీట్లలో ఏదో మొక్కుబడిగా నాయకులకు బాధ్యతలు అప్పగించగా, మరి కొన్ని స్థానాల్లో నాయకులని పెట్టలేదు. ఇక ఆ సీట్లని జనసేనకు ఇవ్వడానికే చంద్రబాబు ఖాళీగా వదిలేసినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో విజయవాడ వెస్ట్‌ని కూడా వదిలినట్లు తెలుస్తోంది. 2014లో ఈ సీటుని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఇక నెక్స్ట్ జనసేనతో పొత్తు ఉంటే ఈ సీటుని ఆ పార్టీకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


అందుకే ఇక్కడ టీడీపీకి సరైన నాయకుడు కనిపించడం లేదు. ఉండటానికి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారు గానీ, ఆయన పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. అటు ఈ సీటు కోసం నాగుల్ మీరా కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు..కానీ చంద్రబాబు ఎవరికి సీటు కేటాయించడం లేదు. నెక్స్ట్ ఒకవేళ జనసేనతో గానీ పొత్తు ఉంటే, ఆ పార్టీకే కేటాయించడం కోసం, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులకు బాధ్యతలు అప్పగించడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: