రాష్ట్రంలో కమ్మ, రెడ్డి వర్గాల ఓట్లు చాలా తక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు వర్గాలే రాష్ట్ర రాజకీయాలని శాసిస్తూ వస్తున్నాయి. దశాబ్దాల కాలం నుంచి ఈ రెండు వర్గాల మధ్యే రాజకీయం నడుస్తోంది. అయితే టీడీపీలో కమ్మ వర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలే గెలిచినా సరే అందులో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు కమ్మ వర్గం వారే ఉన్నారు. అయితే ఇటు వైసీపీలో కూడా కమ్మ వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి చెక్ పెట్టడానికి వైసీపీ సైతం కమ్మ నేతలని బరిలో దించి సక్సెస్ అయింది. ఇక టీడీపీ, వైసీపీలో కలిపి మొత్తం 17 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీలో చూసుకుంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పర్చూరులో ఏలూరి సాంబశివరావు, విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్, మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరీ, విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. గన్నవరంలో వల్లభనేని వంశీ, చీరాలలో కరణం బలరాంలు టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వైపుకు వచ్చారు. ఇక వైసీపీలో చూస్తే వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, గుడివాడలో కొడాలి నాని, దెందులూరులో అబ్బయ్యచౌదరీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

మరి వీరిలో ఈ రెండున్నర ఏళ్లలో సరైన పనితీరు కనబర్చకుండా వీక్ అయ్యారనే విషయం ఒక్కసారి గమనిస్తే... బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని, వసంత, అబ్బయ్య చౌదరీలు వైసీపీలో వీక్‌గా ఉన్నారు. టీడీపీలో వెలగపూడి, వేగుళ్ళ, గద్దె, పయ్యావుల కాస్త వీక్ అయినట్లు తెలుస్తోంది. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గింది గానీ, ప్రధాన ఎన్నికలోచ్చేసరికి చంద్రబాబుని ఓడించడం ఈజీ కాదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: