ఏపీలో జగన్ మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ 25 మంది మంత్రుల్లో ఎంతమంది పనితీరు బాగుంది? అనే విషయాన్ని చూసుకుంటే అందరి పని తీరు బాగుందని చెప్పలేం గానీ, కొందరి పని తీరు మాత్రం బాగుందని చెప్పొచ్చు. సరే మంత్రులుగా పనితీరు పక్కనబెట్టొచ్చు. ఎందుకంటే మధ్యలో చాలాకాలం కరోనాకు పోయింది. పైగా త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు ఎంతమంది పదవులు ఊడతాయో క్లారిటీ లేదు.

కాబట్టి మంత్రులుగా ప్రదర్శన ఎలా ఉందనే విషయాన్ని వదిలేస్తే...ఎమ్మెల్యేలుగా  ఏ మేరకు సత్తా చాటుతున్నారు? ఎంతమందిపై ప్రజా వ్యతిరేకత పెరిగింది? ఎంతమంది నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారు? అనే విషయాలని చూసుకుంటే...25 మంది మంత్రుల్లో ఎక్కువ మందే డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. తక్కువ మంది మంత్రులు మాత్రమే వారి వారి నియోజకవర్గాల్లో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి...మంత్రులంతా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. కానీ అధికార బలాన్ని పక్కనబెడితే..క్షేత్ర స్థాయిలో ఎక్కువ మంది మంత్రులపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఎందుకంటే చాలామంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండటంలో గానీ, వారికి పనులు చేసి పెట్టడంలో గానీ, నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడంలో గానీ వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అలాగే కొన్ని చోట్ల మంత్రులకు ధీటుగా టీడీపీ నేతలు పుంజుకున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో జనసేన గానీ పొత్తు పెట్టుకుంటే కొంతమంది మంత్రులకు డేంజర్ అని చెప్పొచ్చు.

ఈ పరిణామాలని బేరీజు వేసుకుని...మొత్తం మీద చూసుకుంటే....పలాసలో అప్పలరాజు, కురుపాంలో పుష్పశ్రీ, భీమిలిలో అవంతి, కాకినాడ రూరల్‌లో కన్నబాబు, అమలాపురంలో విశ్వరూప్, కొవ్వూరులో వనిత, ఆచంటలో రంగనాథరాజు, ఏలూరులో ఆళ్ళ నాని, మచిలీపట్నంలో పేర్ని నాని, విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రత్తిపాడులో సుచరిత, నెల్లూరు సిటీలో అనిల్, గంగాధరనెల్లూరులో నారాయణస్వామి, ఆలూరులో జయరాం, పెనుకొండలో శంకర్ నారాయణలు డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: